EntertainmentLatest News

బెల్లంకొండ చేసిన పనికి అందరూ షాక్‌.. తండ్రి బాటలో శ్రీనివాస్‌!


యంగ్‌ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్‌ రూటే సెపరేటు. డిఫరెంట్‌ సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఒక స్టైల్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీనివాస్‌కు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. తన ప్రతి సినిమాలోనూ యాక్షన్స్‌ సీక్వెన్స్‌లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సీన్స్‌ని ఎంతో పర్‌ఫెక్ట్‌గా చెయ్యడం వల్ల మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకోగలిగాడు. 

శ్రీనివాస్‌ సినిమాలకు నార్త్‌లో క్రేజ్‌ ఎక్కువ. అతను హీరోగా నటించిన సాక్ష్యం, కవచం, జయజానకి నాయక వంటి సినిమాలు హిందీలోకి డబ్‌ అయి యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టించాయి. జయజానకి నాయక చిత్రానికి 848 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయంటే అతని సినిమాలకు అక్కడ ఎంత ఆదరణ లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఆమధ్య ఛత్రపతి హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ ఆ సినిమా విజయం సాధించలేదు. అయినా ‘రాక్షసుడు’ చిత్రం అతనికి హీరోగా మంచి పేరు తెచ్చింది. ఇకపై తన సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంచాలని నిర్ణయించుకున్నాడట. 

ఇదిలా ఉంటే.. బెల్లంకొండ శ్రీనివాస్‌ మొదటి సినిమా ‘అల్లుడు శీను’ విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన జయాపజయాల గురించి షేర్‌ చేసుకున్నాడు. అంతేకాదు, తన సంతోషాన్ని అంధుల పాఠశాలలోని పిల్లలతో గడిపి వారికి ఆనందాన్ని కలిగించాడు. అందరికీ స్వయం భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశాడు. పిల్లలకు బట్టలు, పుస్తకాలు పంపిణీ చేశాడు. ఇలా తన మంచి మనసును చాటుకున్న శ్రీనివాస్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని తండ్రి బెల్లంకొండ సురేష్‌ తన ప్రతి పుట్టినరోజును హైదరాబాద్‌లోని దేవనార్‌ పాఠశాలలో అంధుల మధ్య జరుపుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఇప్పుడా సంప్రదాయాన్ని బెల్లంకొండ శ్రీనివాస్‌ కొనసాగించడం హర్షణీయమే. 



Source link

Related posts

రైతు బిడ్డలారా ఒక్కటవ్వండి.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘రాజధాని ఫైల్స్’

Oknews

Bodh MLA Bapurao Cheating Case Filed Against Rathod Bapurao In Land Issue

Oknews

Pushpa 2 : What is happening పుష్ప 2 : అసలేం జరుగుతుంది

Oknews

Leave a Comment