ఏ మాటకా మాట చెప్పుకోవాలి.. పూరి జగన్నాధ్(puri jagannadh) ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram potineni) లు ఇరగదీసారంతే.తమ అప్ కమింగ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ తో ఇరగదీసారంతే. ఇదేంటి మూవీ ఇంకా రాలేదు కదా! ఒక వేళ గతంలో సంచలన విజయం సాధించిన ఇస్మార్ట్ శంకర్ గురించి చెప్పబోయి డబుల్ ఇస్మార్ట్ అని చెప్తున్నారేమో అని అనుకోకండి. నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నేను చెప్పేది డబుల్ ఇస్మార్ట్ గురించే.
రామ్, అండ్ పూరి ల డబుల్ ఇస్మార్ట్(double ismart) అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ రికార్డు బిజినెస్ తో తన హవా చాటుతుంది. ఇప్పుడు ఈ మ్యాటర్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ కూడా మారింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు . రామ్ అండ్ పూరి ల గత మూవీలు వారియర్, స్కంద, లైగర్ లు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టరీ గా నిలిచాయి. లైగర్ నష్టం తాలూకు పంచాయితీ అయితే ఇప్పటికి నడుస్తూనే ఉంది. ఇలా గత చిత్రాలు ప్లాప్ గా నిలిస్తే సాధారణంగా అప్ కమింగ్ మూవీస్ బిజినెస్ కొంచం డల్ గా ఉంటుంది.ఇది సినీ ఆనవాయితీ కూడా. కానీ డబుల్ ఇస్మార్ట్ ఆ ఆనవాయితీకి చెక్ పెట్టి భారీ బిజినెస్ ని సొంతం చేసుకుంది.
వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ 60 కోట్లకి జరగగా ఆడియో రైట్స్ 9 కోట్లు, సౌత్ ఇండియా డిజిటల్ రైట్స్ 33 కోట్లు,అదే విధంగా తెలుగు హిందీ డిజిటల్ శాటిలైట్ రైట్స్ కలిపి 50 కోట్ల కి అమ్ముడయ్యింది. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా చేస్తుండగా సంజయ్ దత్, షాయాజీ షిండే, బని జె, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఇటీవల వచ్చిన మార్ ముంత చోడ్ చింత సాంగ్ సినిమా మీద ఉన్న అంచనాలని రెట్టింపు చేసింది. మరి పూరి, రామ్ లు ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి. మణిశర్మ సంగీత దర్శకుడు కాగా పూరి ఛార్మి లు నిర్మాతలు. తెలుగు తో పాటు తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.