ప్రశాంత్ వర్మ.. భారీ సెటప్ Great Andhra


హనుమాన్ సినిమాకు ముందే, దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఓ మాంచి ఆఫీసు సెటప్ వుంది. అక్కడే చాలా వరకు పనులు సినిమాకు సంబంధించి జ‌రిగిపోయేవి. పోస్టర్ డిజైన్ల దగ్గర నుంచి చాలా వర్క్ లు అక్కడే చేసేవారు. హనుమాన్ విడుదల త‌ర్వాత‌ అనేక సినిమా క్రాఫ్ట్ లకు సంబంధించి వంద మందిని రిక్రూట్ చేసుకుంటా అని ప్రకటించారు. మాగ్జిమమ్ సినిమా వర్క్ లు అన్నీ తన ఆఫీస్ లోనే పూర్తి చేసేలే ప్లాన్ చేసారు.

అందుకోసం ఇప్పుడు ఓఆర్ఆర్ లో నిర్మాత సి. కళ్యాణ్ కు చెందిన పెద్ద భవనాన్ని ఇరవై కోట్లతో ప్రశాంత్ వర్మ కొనుగోలు చేసారు. అందులో భారీగా ఆఫీసును తయారు చేస్తున్నారు. సిజి వర్క్ లు, డైరక్షన్ డిపార్ట్ మెంట్, ఇంకా 24 క్రాఫ్ట్ ల్లో మాగ్జిమమ్ క్రాఫ్ట్ టెక్నీషియన్లు తన దగ్గరే వుండేలా, అక్కడే పనులు జ‌రిగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ప్రశాంత్ వర్మ అటు జై హనుమాన్, ఇటు నందమూరి మోక్షు హీరోగా సినిమా టేకప్ చేయాల్సి వుంది. ఈ రెండు సినిమాలతో పాటు పశాంత్ అనుకున్న అనేక ఐడియాలు డెవలప్ చేసి, స్క్రిప్ట్ లు గా మార్చే పని ఈ కొత్త ఆఫీసులో చేపడతారు. మొత్తానికి మన దర్శకుల్లో రాజ‌మౌళి తరువాత ఇలా కార్పొరేట్ స్టయిల్ లో ఆలోచించే దర్శకుడిగా ప్రశాంత్ వర్మ వుంటారు.



Source link

Leave a Comment