లెక్కలు పూర్తిగా చెప్పండి చంద్రబాబూ!


2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జ‌గన్ అంత వేస్ట్ ఫెలో ప్రపంచంలో లేడు. అలాంటి వాడిని ఏం చేసి అయినా సరే మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదు. ఎప్పటికీ, ఎన్ని దశాబ్దాలు దాటినా తెలుగుదేశం పార్టీనే అధికారంలో వుండాలి. ఇదీ ఎల్లో మీడియా గోల. దానికి కంటెంట్ ఇచ్చేలా తెలుగుదేశం పార్టీ శ్వేత పత్రాలు. సాక్షికి ఇన్ని వందల కోట్ల ప్రకటనలు ఇచ్చారు. వైకాపా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది. ఇన్ని లక్షల కోట్ల బకాయిలు పెట్టి పోయింది అంటూ లెక్కల మీద లెక్కలు.

సంతోషం. ఇలా అన్ని విషయాలు ప్రజ‌లకు తెలిసేలా బయట పెట్డడం మంచి పద్దతి. కానీ ఇలా చేసే ముందు తెలుగుదేశం పార్టీ అధినేత, సిఎమ్ చంద్రబాబు తన చిత్తశుద్దిని కూడా ప్రదర్శించాలి కదా. 2019 నాటికి ఇన్ని లక్షల కోట్ల అప్పులు వున్నాయి, ఖజానాలో వంద కోట్లు మాత్రం మిగిల్చారు. ప్రభుత్వ బిల్లులు కోట్ల కొద్దీ పెండింగ్ లో వుంచారు అంటూంది వైకాపా. అలాగే అప్పట్లో సర్క్యులేషన్ రీత్యా థర్డ్ ప్లేస్ లో వున్న ఆంధ్రజ్యోతికి కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి సాక్షిని పక్కన పెట్టారనే విమర్శ వుంది.

అందువల్ల ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది ఏమిటంటే

2014 నుంచి 2019 వరకు ఎన్ని అప్పలు తెచ్చారు

అదే టైమ్ లో ఎన్ని బిల్లులు పెండింగ్ లో వుంచారు

బాబు దిగిపోయేటప్పటికి ఖజానాలో ఎంత మొత్తం మిగిలింది

2014-19 మధ్యలో ఈనాడు.జ్యోతి, సాక్షి లకు ఏ మేరకు ప్రకటనల కోసం ఇచ్చారు

ఉద్యోగులకు ఏ మేరకు బకాయిలు పెట్టారు.

ఇలా ప్రతి ఒక్కటీ ఇప్పుడు ఎలా వివరంగా తెలియచేసారో అప్పటి పరిస్థితిని కూడా వివరించాలి.

2014 నాటకి అప్పులు.. 2019 నాటికి అప్పలు.. 2024 నాటికి అప్పులు ఎంతెంత అన్నది తెలిస్తే జ‌నాలకు మరింత క్లారిటీ వస్తుంది. చంద్రబాబు గొప్పతనం తెలిసి వస్తుంది. అప్పుడు జ‌గన్ ను మరింత ద్వేషిస్తారు.

అంతే తప్ప, ఎంతసేపూ, జ‌గన్ దారుణం చేసారు. విధ్వంసం చేసారు. ఆంధ్ర అధ్వాన్నం అయిపోయింది అనే పడికట్టు పదాలే మాట్లాడి, అవే ప్రచురిస్తే ఎలా?

The post లెక్కలు పూర్తిగా చెప్పండి చంద్రబాబూ! appeared first on Great Andhra.



Source link

Leave a Comment