EntertainmentLatest News

20 కోట్లతో ప్రశాంత్‌వర్మ ఆఫీస్‌.. ఏం చేస్తారక్కడ?


‘హనుమాన్‌’ సాధించిన ఘనవిజయంతో ప్రశాంత్‌వర్మ టాప్‌ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. అంతకుముందు చేసిన సినిమాలు అతనికి ఆశించిన గుర్తింపు తీసుకురాలేదు. ఒక్క సినిమా అతని కెరీర్‌ని టర్న్‌ చేసేసింది. ఇప్పుడు ప్రశాంత్‌ ఓ కొత్త సెటప్‌ చేయబోతున్నాడు. 20 కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని కొనుగోలు చేశాడు. దాన్ని తన ఆఫీస్‌గా కన్వర్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అంతకుముందు అతనికి ఓ ఆఫీస్‌ ఉంది. అందులోనే తన సినిమాలకు సంబంధించిన పనులన్నీ జరిగేవి. ‘హనుమాన్‌’ విడుదలైన తర్వాత 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన 100 మందిని రిక్రూట్‌ చేసుకుంటానని ఆ మధ్య ప్రకటించాడు ప్రశాంత్‌. 

సినిమా ఆఫీస్‌ కోసం అంత పెద్ద బిల్డింగ్‌ ఎందుకు అనే డౌట్‌ అందరికీ వస్తుంది.  అంతేకాదు, వందమందికి తన ఆఫీస్‌లో జాబ్‌ కల్పిస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అసలు అక్కడ ఏం చెయ్యబోతున్నారనేది ఆరా తీస్తే.. సిజి వర్క్‌, డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌తోపాటు 24 క్రాఫ్ట్స్‌లోని ఎక్కువ భాగం టెక్నీషియన్లు తన దగ్గరే ఉండి సినిమాకి సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేందుకు ప్లాన్‌ చేశాడు ప్రశాంత్‌. ఇక అతను చేసే సినిమాల విషయానికి వస్తే ‘జై హనుమాన్‌’ పూర్తి చెయ్యాల్సిన బాధ్యత ఉండనే ఉంది. అలాగే నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించే సినిమాను డైరెక్ట్‌ చెయ్యాలి. వీటితోపాటు తన దగ్గర ఉన్న ఐడియాలను డెవలప్‌ చేసి స్క్రిప్ట్‌లుగా మార్చే ప్రక్రియ ఈ ఆఫీసులోనే జరుగుతుందని తెలుస్తోంది. 



Source link

Related posts

Janhvi Kapoor Favourite Cricketers వాళ్లిద్దరూ అంటే చాలా ఇష్టం: జాన్వీ కపూర్

Oknews

స్టార్ హీరోలు షేక్ అయ్యేలా ‘హనుమాన్’ ప్రభంజనం!

Oknews

Disappointed Mahesh fans నిరుత్సాహ పడిన మహేష్ ఫ్యాన్స్

Oknews

Leave a Comment