చాలామంది నటవారసులు హీరో అవుదామని ఫిక్స్ అయి వచ్చినవాళ్లే. చాలా కొద్దిమంది మాత్రం రకరకాలు ట్రై చేసి చివరికి హీరోగా సక్సెస్ అయ్యారు. తెలుగులో రానా, ప్రభాస్ లాంటి వాళ్లు ఈ కోవకు చెందుతారు. తమిళ్ లో హీరో సూర్య కూడా ఇదే బాపతు.
సూర్య తండ్రి శివకుమార్ అప్పటికే పాపులర్ నటుడు. నటవారసుడిగా మారాలనుకుంటే వెంటనే హీరో అయిపోవచ్చు. కానీ సూర్య మాత్రం నటుడు అవ్వాలనుకోలేదు. తండ్రి ఇమేజ్ కు భిన్నంగా, అతడి రంగానికి దూరంగా ఏదైనా సాధించాలనుకున్నాడు.
సూర్యకు 20 ఏళ్ల వయసుకే అసై అనే సినిమా ఆఫర్ వచ్చింది. కానీ అప్పటికే అతడ్ని మరో రంగం ఆకర్షించింది. 21 ఏళ్ల వయసులో అతడు గార్మెంట్స్ బిజినెస్ లోకి వెళ్లాడు. సినిమా ఆఫర్ వద్దనుకొని, ఆ వ్యాపారంలో రాణించేందుకు ముందుగా ఓ క్లాత్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాడు. జీతం 736 రూపాయలు. అదే సూర్య తొలి సంపాదన.
అయితే విధి అతడ్ని సినిమాల వైపు లాక్కొచ్చింది. ఓ సందర్బంలో దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఇచ్చిన ప్రోత్సాహంతో సూర్య సినిమాల్లోకి అడుగుపెట్టాడు. నిజానికి సూర్య అసలు పేరు అది కాదు. మణిరత్నమే ఈ నటుడి పేరు మార్చారు. అలా 22 ఏళ్ల వయసులో తొలి సినిమా చేశాడు. అక్కడ్నుంచి 4 ఏళ్ల వరకు ఎలాంటి బ్రేక్ లేదు.
ఏదైనా సాధించడానికి, తన తండ్రికి భిన్నంగా కొత్తగా చేయడానికి ఇండస్ట్రీలో చాలా అవకాశం ఉందని అప్పుడే గ్రహించాడు. అలా అంచెలంచెలుగా రూ.350 కోట్ల నెట్ వర్త్ కు ఎదిగాడు. సూర్య ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా. అతడి ప్రతి సినిమాకు అతడే సహ-నిర్మాత. మరికొన్ని సినిమాలకు సోలో నిర్మాత కూడా.