EntertainmentLatest News

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్!


1974లో విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) .. ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాలలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించబోతున్నారు.

నందమూరి వసుంధర, నందమూరి తేజస్విని పుట్టినరోజు శుభ సందర్భంగా NBK హెల్పింగ్ హ్యాండ్స్ బిగ్ అనౌన్స్ మెంట్ చేసింది. 50 వసంతాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలను NBK HELPING HANDS ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా.. లక్షలాది అభిమానుల సమక్షంలో.. అతిరథమహారధులు మధ్య చరిత్రలో శాశ్వతంగా నిల్చిపోయేలా జరపాలని ఘనంగా ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ స్వర్ణోత్సవ  సంబరం  తెలుగు చలనచిత్ర పరిశ్రమ సెప్టెంబర్ 1 హైదరాబాద్ లో నిర్వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున జరగనుంది.

“మన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మన బాలయ్య కోసం మనమందరం చేసే అతిపెద్ద పండుగ … ఈ పండుగలో అన్న NTR అభిమానులు , ప్రతి నందమూరి అభిమాన సోదరులందరూ పాల్గొనాలని మనవి. ఈ అవకాశం కల్పించిన బాలయ్య గారికి కృతజ్ఞతలు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాము.” అని NBK హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అనంతపురం జగన్ తెలిపారు.



Source link

Related posts

Strong buzz on Indian 2 release ఇండియన్ 2 రిలీజ్ పై స్ట్రాంగ్ బజ్

Oknews

సభ్యులకు హెల్త్‌ కార్డులు పంపిణీ చేసిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌!

Oknews

బడ్జెట్‌ రూ.3 కోట్లు.. కలెక్షన్‌ రూ.113 కోట్లు. ఈ రికార్డును క్రాస్‌ చెయ్యడం సాధ్యమా?

Oknews

Leave a Comment