జగనన్నా.. ఒంటరిగా ఇక వద్దు! Great Andhra


‘సింహం ఒంటరిగానే వస్తుంది’ అనే డైలాగు జగన్మోహన్ రెడ్డి అనుచరులు అనేక సందర్భాల్లో వాడుతూ ఉంటారు. ప్రత్యర్థులు జట్టుగా ఏర్పడి.. సమరశంఖం పూరించినప్పుడు.. జగన్ ను ఆయన సొంత గణాలు ఈ ఒక్క మాటతోనే అనేక విధాలుగా మభ్యపెట్టారు! ఈ సింహలక్షణం జగన్ కు ఇష్టమైనదే కావొచ్చు. కానీ సింహం ఒంటరిగా వస్తుందని అంటే దాని అర్థం…‘సింహం ఎప్పటికీ, మరే ఇతర జీవితోనూ స్నేహం చేయదు’.. అని కూడా కాదు. ఆ సంగతి జగన్ తెలుసుకోవాలి.

ఎలాంటి విషమ పరిస్థితులనైనా ఒంటరిగా మాత్రమే ఎదుర్కోవాలి.. అనే ఆయన ధీరోదాత్త వైఖరికి ఎలాంటి మచ్చ పడదు. కానీ.. రాజకీయాల్లో కొన్ని పట్టు విడుపులు ఉండాలి. అలాగని కేంద్రంలో ఎన్డీయే కూటమి డోర్లు ఫ్రీజ్ అయి ఉన్న‌ నేపథ్యంలో ఆయన ఇండియా కూటమి తలుపు తట్టే విషయం ఆలోచించాలి. పార్టీ శ్రేణుల్లో, నాయకుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయానికి, కోరికకు అక్షరరూపం ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ జగనన్నా.. ఒంటరిగా ఇక వద్దు!’

సింహం ఒంటరిగా దాడి చేయడానికి ఇష్టపడవచ్చు. దాని అర్థం అది సమూహంగా దాడి చేయడానికి ఇష్టపడదు అని కాదు. స్నేహాలకు వ్యతిరేకం అని కాదు. ఈ సంగతి జగన్ తెలుసుకోవడం ఎంత అవసరమో… అంతే ముఖ్యంగా మరో సంగతిని కూడా గ్రహించాలి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని పెద్దలు అంటూ ఉంటారు. ఆ సిద్ధాంతం ప్రకారం.. అస్తిత్వ పరిరక్షణ కోసం భవిష్యత్తు స్థిరత్వం కోసం కనీసం తాత్కాలిక మిత్రులను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన మొగ్గు చూపించాలి.

వచ్చే 2029 నుంచి మన దేశంలో జమిలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా తమ తమ మనుగడ వ్యూహాలను పునర్ రచించుకోవాల్సిన అవసరం ఉంది. జమిలి ఎన్నికలు జరగడం అంటే దేశవ్యాప్తంగా కీలకమైన ప్రధాన జాతీయ పార్టీల ప్రాబల్యమే ఎన్నికలలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుచేతనే ఈ జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను రూపుమాపడానికి కేంద్రంలో మోడీ సర్కారు చేసిన కుట్రగా అభివర్ణించిన పెద్దలు కూడా ఉన్నారు. అలాంటి నిరసనలన్నింటినీ దాటుకుని జమిలి ఎన్నికల నిర్ణయం కూడా జరిగిపోయింది. ఇప్పుడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తమ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కొత్త పద్ధతులను వెతుక్కోవలసిన అవసరం ఉంది.

ఆ కోణాన్ని కూడా కలిపి గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ప్రబలంగా ఉండగల ఏదో ఒక కూటమిలో తన పార్టీని కూడా భాగస్వామిగా ఉంచాల్సిందే. ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెసుకు డోర్లు క్లోజ్ అయి ఉన్నాయి. ఏపీలో ఆయనను తీవ్రంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్డీఏలో భాగస్వాములు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆ కూటమిలోకి ఆహ్వానిస్తారనిచ ఆయన వెళితే ఆమోదిస్తారని అనుకోవడం భ్రమ.

అదే సమయంలో కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమిలోకి వెళ్లడానికి అవకాశం ఉంది. అది స్వయంగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన పార్టీ. ఆయన తండ్రి తన జీవితాన్ని అంకితం చేసిన పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పట్ల మొగ్గడానికి మొగ్గడం- తనకు తలకొట్టేసినట్టుగా ఉంటుందని, అవమానంగా అనిపిస్తుందని జగన్ బాధపడే అవసరం లేదు. రాజకీయాలలో ఎప్పుడు వ్యూహాలు మాత్రమే నిజం. పంతాలు, పట్టింపులు శాశ్వతంగా ఉండవు.

దేశంలో జమిలి ఎన్నికలు మొదలైన తర్వాత ఎన్నికల వ్యవహారం మొత్తం రెండు కూటముల మధ్య జరిగే పోరాటం గా మారిపోతుంది. అలాంటప్పుడు ఏదో ఒక కూటమి వైపు లేకపోవడం ప్రాంతీయ పార్టీలకు చాలా పెద్ద నష్టం అవుతుంది కూడా. ఆ విషయాన్ని జగన్ ఇప్పుడే గ్రహించి జాగ్రత్త పడితే ఆయనకు శ్రేయస్కరం.

కాంగ్రెస్ ఓకే అంటుందా

జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో భాగంగా ఉంటూ రాజకీయం చేయాలని పార్టీ శ్రేణుల వినతులు ఒత్తిళ్ళ మేరకు ఒప్పుకోవచ్చు గాక. ఈనందుకు సిద్ధపడినంత మాత్రాన వెంటనే కాంగ్రెస్ రెడ్ కార్పెట్ వేరు వేసి ఆహ్వానిస్తుందా అనేది కీలకంగా గమనించాలి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీని ఇన్నాళ్లుగా తీవ్రంగా నిరసిస్తూ వచ్చారు. ఆ కూటమిలో భాగమైన వామపక్షాల వారిని కూడా చిన్న చూపు చూశారు. ఇప్పుడు ఇండియా కూటమిలో భాగం కావాలని అనుకుంటే వారందరూ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అది అంత ఈజీ ఏమీ కాదు.

కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ పెత్తనాన్ని ధిక్కరించి రాజకీయాలలో ఎదిగిన వ్యక్తి జగన్. ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైఖరితో ఉంటుంది అనేది కూడా ఇక్కడ గమనించాల్సిన సంగతి. ఒకప్పట్లో సోనియా కుటుంబ అహంకారానికి నిలువెత్తు ప్రశ్నార్ధకంగా లాగా ఎదురుపడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమిలో చేరుతాను అనే ప్రతిపాదనతో వస్తే ఆమె ఎలా దాన్ని అర్థం చేసుకుంటారో గమనించాలి. అటువైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం అంత సులువు కాదు. కానీ ఆ కుటుంబంలోని ఇతర పార్టీలు నేతలతో సత్సంబంధాలను కలిగి ఉంటే జగన్మోహన్ రెడ్డికి అది అసాధ్యం కూడా కాదు.

స్నేహబంధాలే బాటలు వేస్తాయి

కూటమిలోని ఇతర పార్టీల నాయకులతో స్నేహ సంబంధాలు కలిగి ఉంటే రాజకీయంగా మరింత బలంగా ఎదగడానికి, జాతీయ రాజకీయాలలో కూడా ప్రభావశీలమైన పాత్ర పోషించడానికి అవి ఎంతో ఉపయోగపడతాయని జగన్మోహన్ రెడ్డి ఈపాటికి గ్రహించి ఉండాలి. ఢిల్లీలో ధర్నా ద్వారానే ఆయనకు ఈ సంగతి బోధపడి ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ధర్నాకు ఉత్తరప్రదేశ్ లోని సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా వచ్చి మద్దతు తెలియజేశారు. దాని వలన వచ్చేది వచ్చిన మైలేజీ గణనీయమైనదే.

అదే సమయంలో మమత బెనర్జీ స్టాలిన్ వామపక్షాలకు చెందిన పెద్దల నుంచి కనీసం ట్వీట్ల రూపంలో అయినా జగన్ ఎందుకు తన దీక్షకు మద్దతు సంపాదించలేకపోయారు.. అనేది ఆయన ఆత్మ సమీక్ష చేసుకోవాలి.

రాజకీయంగా ఇతర రాష్ట్రాలలోని ఇతర పార్టీల అధినేతలతో సత్సంబంధాలను కలిగి ఉండే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు. అలాంటిది చాలా అవసరం కూడా. మమతా బెనర్జీ, స్టాలిన్ ఇలాంటివారితో గట్టి బంధం ఉన్నట్లయితే ఇండియా కూటమిలోకి జగన్ ప్రవేశించకుండా ఆపడం సోనియా తరం కూడా కాదు. రాహుల్‌కు ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆకూటమిలో చక్రం తిప్పగలరు. అలాంటి అవకాశాలను జగన్ ప్రయత్నించాలి.

రేవంత్ అడ్డుపడతారా?

చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కూటమిలోకి జగన్ రావడానికి ఇష్టపడతారా అనేది ఇప్పుడు ఎదురవుతున్న పెద్ద ప్రశ్న. ఆయన గట్టిగా వ్యతిరేకిస్తే జగన్ను కూటమిలోకి రానివ్వడం జరగదు అని కూడా పలువురు అంటున్నారు. చంద్రబాబు నాయుడు- జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ ఒంటరిగానే ఉంచేయాలని కుట్రతో రేవంత్ ద్వారా అడ్డుపుల్ల వేయిస్తారని అనుమానం కొందరిలో ఉంది.

రేవంత్ ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో బలమైన ముఖ్యమంత్రి గానే ఉన్నారు అయితే ఆయన రాహుల్ నిర్ణయాలను శాసించే స్థానంలో ఉన్నారని అనుకోవడం భ్రమ. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ద్వారా చక్రం అడ్డువయించే అవకాశం ఉంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా ఇలాంటి అవాంతరాలను అధిగమించడం చాలా ఈజీ. రేవంత్ లాంటి నాయకుడు అడ్డం పడితే కర్ణాటకలోని డీకే శివకుమార్ లాంటి నాయకుడి ద్వారా రాయబారాలు నడిపి డీల్ ఫిక్స్ చేసుకోవడం మంచి పద్ధతి.

ఏది ఏమైనప్పటికీ ఒక కూటమిలో భాగంగా ఉండటమే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ శ్రేయస్కరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన బుర్రలో మరి ఎలాంటి ఆలోచనలు రన్ అవుతున్నాయో తెలుసుకోవడం కష్టం.

ఈసారి చెల్లెమ్మ రాఖీ కడుతుందా?

ఇలాంటి ప్రతిపాదన ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రుచించి కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ఇండియా కూటమిలో అడుగుపెట్టడానికి ఆయన సిద్ధపడవచ్చు అయితే ఆయన ఒక్కడు సిద్ధపడినంత మాత్రాన అధి కార్యరూపం దాల్ వస్తుందని చెప్పడానికి కూడా వీల్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో వేరుచుకుపడుతున్న ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సారథిగా ఉన్నారు.

ఎన్నికల తర్వాత కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డిని ఆమె ఎక్కువగా నిందిస్తూ ఉన్నారు. అలాంటి షర్మిల జగన్ కాంగ్రెస్ జట్టులో ఉండడానికి ఇష్టపడతారని అనుకోవడం బ్రహ్మ అయితే ఆమె వైపు నుంచి వచ్చే అభ్యంతరాలను కాంగ్రెస్ పార్టీ గానీ జగన్ గానీ ఏ రకంగా సర్దుబాటు చేస్తారు అనేది తీరికంగా గమనించాల్సిందే

వైయస్ షర్మిల జగన్ కోసం గతంలో చాలా పాటుపడ్డారు జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ సారథ్యాన్ని ఆమె స్వీకరించారు పాదయాత్ర బాధ్యతను కూడా ఆమె నిర్వహించారు 2019 ఎన్నికలకు ముందు వరకు ఇద్దరి మధ్య సంబంధాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో జగన్తో సమానంగా షర్మిల కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు జగన్ ముఖ్యమంత్రి కావడంలో తన వంతు పాత్ర పోషించారు ఇద్దరి మధ్య ఆ తర్వాతే విభేదాలు వచ్చాయి షర్మిల తన కుటుంబానికి రాజకీయ పదవులు కోరినప్పుడు అభ్యంతర పెట్టానని వ్యాపారాలు చేసుకుంటే సహకరిస్తానని చెప్పినట్లుగా జగన్ స్వయంగా వెల్లడించారు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

షర్మిలకు పదవి ఇచ్చి ఉంటే ఆమెతో విభేదాలు వచ్చేవే కాదు కదా అనే విలేకరుల ప్రశ్నలకు జగన్ సరైన రీతిలో సమాధానాలు చెప్పలేకపోయారు ఒక కుటుంబంలో ఒక తరంలో ఒకరికే పదవి ఉండాలి అనేది తన పార్టీ సిద్ధాంతం అని డొంక తిరుగుడుగా సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి ఇద్దరు ఒకతరంలో ఒక కుటుంబంలో పదవులు అనుభవించిన వారే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బొత్స కుటుంబంలో ఎంత మందికి టికెట్లు ఇచ్చారో లెక్కలేదు వారంతా ఒక కుటుంబం కాదని బుకాయించినప్పటికీ బొత్సకు ఆయన భార్యకు కూడా టికెట్లు ఇవ్వడం జగన్ చెబుతున్న సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం తాను పిన్ని తండ్రి కొడుకు అవినాష్ కుటుంబాన్ని మాత్రం ప్రోత్సహిస్తూ షర్మిలను మాత్రం దూరం పెట్టాలని నిర్ణయించుకున్నందుకు ఏదో ఒక బుకాయంపు సమాధానం మీది తప్ప మరొకటి కాదు ఆ రకంగా చెల్లెలితో ఏర్పడిన పైసమ్యాలను జగన్ స్వయంగా సరిదిద్దుకోవాల్సి వస్తుంది.

అందుకు ఆయన ఎలాంటి మూల్యం చెల్లించవలసి వస్తుందో ఇప్పుడే చెప్పలేం చెల్లెలితో ఏర్పడిన తగాదా వల్ల జగన్ గత ఎన్నికలలో కూడా కొంత అమూల్యం చెల్లించాల్సి వచ్చింది. చెల్లెలు ఎటు విభేదించింది సరే కనీసం తల్లి కూడా ఎన్నికల ప్రచారానికి రాలేదు సింహం ఒంటరి సింహం ఒంటరి అనే పరికట్టు పదజాలానికి అలవాటు పడిన జగన్ ప్రచార పర్వాన్ని కూడా పూర్తిగా తాను ఒంటరిగా చూసుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం అస్తిత్వ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఓటమిలో చేయవలసిన వస్తే కుటుంబ సంబంధాలు కూడా మళ్లీ ముడి పడతాయి మేనల్లుడి పెళ్లికి జగన్ వెళ్లి ఉండకపోవచ్చు కానీ మేలుకోడలు పెళ్ళికి షర్మిల అన్ని దగ్గరుండి చూసే రోజు వస్తుంది అంతకంటే ముందు షర్మిల మళ్లీ అన్నయ్యకు రాఖీ కడుతుంది

సలహాలపై డిపెండ్ కాకుండా

జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోకుండా సలహాదారులను మార్చుకోకుండా ఇప్పటికీ వారు చెబుతున్న మాటలు మీదనే ఆధారపడి రాజకీయం చేస్తానంటే అది తప్పు. ఇప్పుడు ఉన్న సలహాదారులే పార్టీని నాశనం చేశారని జగన్ ను ముంచేసారని అనేక ఆరోపణలు ఉన్నాయి. కనీసం భవిష్యత్తును స్పష్టంగా నిర్దేశించే ఇలాంటి విషయాలను ఆయన సరే.. ఆయన జాగ్రత్తగా బేరీజు వేసుకుని సొంత నిర్ణయం తీసుకోవాలి.

ఒంటరిగా ఉండడం గొప్ప విషయమే.. కానీ జగన్ చెప్పుకున్నట్లు ఆయనను వ్యతిరేకిస్తున్న పార్టీలు తమకు ధైర్యం చాలక ఓడించడానికి కుట్రపూరితంగా జట్టుకడుతున్నారని కూడా అనుకుందాం. మరి అలాంటి కుట్రలకు కౌంటర్ వ్యూహాలు జగన్ వద్ద ఉండాలి కదా? ఆ క్రమంలోనే ఆయన జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిని ఎంచుకుని అడుగులు వేయడం మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జమిలి ఎన్నికల వ్యూహాలకు తగినట్లుగా ఏదో ఒక జాతీయ కూటమిలో ఇప్పటినుంచే ఉండడమా? లేదా ‘ఒంటరిగానే వస్తుంటా’ అనే మాటతో నిత్యం ఆత్మవంచన చేసుకుంటూనే ఉండడమా అనేది జగన్ నిర్ణయించుకోవాలి.

..ఎల్. విజయలక్ష్మి



Source link

Leave a Comment