EntertainmentLatest News

మహేష్ బాబు కుటుంబంలో విషాదం..ఎన్టీఆర్ మీద పోటీ చేసిన మహామనిషి మృతి 


సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)కుటుంబంలో ఒక విషాదం చోటు చేసుకుంది. నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలని నిర్మించి ప్రేక్షకాదరణ పొందేలా చేసిన సూర్యనారాయణ  మృతి చెందారు. దీంతో పలువురు చిత్ర ప్రముఖులతో పాటు నిర్మాతల మండలి  తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సూర్య నారాయణ  పూర్తి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణబాబు(suryanarayana babu)ఈయన సూపర్ స్టార్ కృష్ణ(krishna)గారికి బావ అవుతారు.కొన్ని రోజుల క్రితం అస్వస్థతకి లోనవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు బృందం నిరంతరం ట్రీట్ మెంట్ అందిస్తూనే ఉంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కృష్ణ జిల్లా రిమ్మనపూడి

  1977 లో  కృష్ణ, కృష్ణం రాజు హీరోలుగా వచ్చిన మనుషులు చేసిన దొంగలు తో ఆయన సినీ ప్రస్థానం మొదలయ్యింది.  రామ్ రాబర్ట్ రహీమ్, సంధ్య, నా ఇల్లు నావాళ్లు, ఈ దేశంలో ఒక రోజు, బజార్ రౌడీ, మహామనిషి, సంచలన, కలియుగ విశ్వా మిత్ర, అల్లుడు దిద్దిన కాపురం వంటి చిత్రాలు నిర్మించారు.అదే విధంగా కన్నడ,హిందీ భాషల్లోను రెండు చిత్రాలు నిర్మించారు.సంధ్యతోనే  స్టార్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి ని దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇక  1985 లో నందమూరి తారకరామారావు పై గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణ సోదరి లక్ష్మి తులసి ని సూర్యనారాయణ వివాహమాడారు. 

 



Source link

Related posts

lateral entry into polytechnic common entrance test TS LPCET 2024 Notification Released for ITI candidates | TS LPCET: ఐటీఐ విద్యార్థులకు పాటిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు

Oknews

Telangana CM Revanth Reddy will be discussed with the High Command about Lok Sabha candidates | Telangana News : ఢిల్లీలో రేవంత్ రెడ్డి

Oknews

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఏజెంట్'..!

Oknews

Leave a Comment