త్వరలో బిగ్‌బాస్ రియాల్టీ సీజన్ -8 ప్రారంభం కానుంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌పై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీజన్‌కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను ఎంపిక చేస్తే అద్భుతంగా వుంటుందని నెటిజన్లు అభిమానంతో అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే టాస్క్‌లను సక్సెస్ ఫుల్‌గా చేయడంలో షర్మిలకు మించిన వారుండరని నెటిజన్లు ఆమెను కీర్తిస్తున్నారు.
ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ పెద్దలు ఇస్తున్న టాస్క్‌లను విజయవంతంగా ఎలా నెరవేరుస్తున్నారో బిగ్‌బాస్ టీమ్ చూసి, ఆమెను ఎంపిక చేసుకుంటే.. రియాల్టీ షో సూపర్ సక్సెస్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. రాజకీయ రంగం నుంచి ఆమెను ఎంపిక చేసుకోవడం వల్ల టీఆర్పీ రేటింగ్స్ విపరీతంగా పెరుగుతాయని, వ్యాపార కోణంలో చూసినా షర్మిల ఎంపిక అన్ని రకాలుగా మంచిదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తన అన్న జగన్‌కు వ్యతిరేకంగా నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వెనుక… కాంగ్రెస్ కంటే, టీడీపీ ప్రముఖులు, ఆ పార్టీ అనుకూల మీడియా యజమానులున్నారనే చర్చకు తెరలేచింది. వాళ్లిచ్చే టాస్క్‌లనే షర్మిల ప్రతిరోజూ క్రమంగా తప్పకుండా, విజయవంతంగా నెరవేరుస్తున్నారని వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు చెబుతున్నారు.
బిగ్‌బాస్ రియాల్టీ షోలో పెద్ద ఎత్తున టాస్క్‌లుంటాయని, అందుకే షర్మిలను ఎంపిక చేసుకుంటే, ఓ పనై పోతుందని అంటున్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో, షర్మిల ఎంపికతో మరోసారి రేటింగ్స్‌లో మొదటి స్థానంలోకి వచ్చే అవకాశం వుందని నెటిజన్లు అభిమానంతో చెబుతున్నారు. నెటిజన్ల అభిప్రాయాల్ని బిగ్‌బాస్ టీమ్ పరిగణలోకి తీసుకుంటుందో, లేదో చూడాలి.
The post షర్మిలను రియాల్టీ షోలోకి తీసుకోరూ… ప్లీజ్! appeared first on Great Andhra.