‘ఉస్తాద్’ నిర్మాతలకు పవన్ అభయం


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత ఫ్యాన్స్ కు ఒక పక్క ఆనందం. మరో పక్క టెన్షన్. మంచి పదవి లో వున్నందుకు ఆనందం. కానీ సినిమాలకు దూరంగా వున్నందున, టెన్షన్. పవన్ సినిమాలు మూడు నిర్మాణంలో వున్నాయి. ఒకటి క్రిష్- ఎఎం రత్నం- హరిహర వీరమల్లు, రెండవది.. డివివి దానయ్య- సుజిత్..ఓజి. మూడవది మైత్రీ- హరీష్ శంకర్- ఉస్తాద్. ఈ మూడు సినిమాలు కాక ఇంకా మరో రెండు వున్నాయి కానీ అవన్నీ వార్తల్లో మాత్రమే.

ఇప్పుడు ఈ మూడు సినిమాలు పవన్ పూర్తి చేస్తారా.. చేయరా అన్నది ఫ్యాన్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఓజి సినిమాకు జ‌స్ట్ పది నుంచి ఇరవై రోజుల వరకు టైమ్ ఇస్తే చాలు పూర్తయిపోతుంది. అదే విధంగా హరి హర వీరమల్లుకు కూడా. అందువల్ల ఈ రెండు సినిమాలు అయితే పవన్ ఫినిష్ చేస్తారు అనే నమ్మకం వుంది. అయితే అది ఎప్పుడు. ఎలా.. వీలు కలుగుతుంది అన్నది చూడాలి. ఓ ఆర్నెల్ల వరకు అయితే తన మంత్రిత్వ శాఖలు అన్నీ చూసుకుని, పని ఆకళింపు చేసుకున్న తరువాత కానీ పవన్ కు వీలు చిక్కదు.

ఇదిలా వుంటే జ‌స్ట్ అయిదు నుంచి పది రోజులు మాత్రం షూట్ చేసిన ఉస్తాద్ సినిమా సంగతి ఏమిటి అన్నది అసలు సిసలు ప్రశ్న. మైత్రీకి డబ్బులు వెనక్కు ఇచ్చేస్తారు అనే గ్యాసిప్ వుంది. ఎందుకుంటే ఉస్తాద్ సినిమాకు కనీసం 60 రోజులు కేటాయించాలి కనుక. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమా కూడా పూర్తి చేయలనే అనుకుంటున్నారట. ఈ మేరకు మైత్రీ అధినేతలకు చెప్పారట. ఈ మధ్య మైత్రీ అధినేతలు కలిసినపుడు, తాను తప్పకుండా ఉస్తాద్ సినిమా పూర్తి చేస్తా అని చెప్పారట.

అందువల్ల ఇక పవన్ ఫ్యాన్స్ నిశ్చింతగా వుండొచ్చు. పవన్ నుంచి రాబోయే కాలంలో మూడు సినిమాలు పక్కాగా విడుదలవుతాయి.

The post ‘ఉస్తాద్’ నిర్మాతలకు పవన్ అభయం appeared first on Great Andhra.



Source link

Leave a Comment