EntertainmentLatest News

డా. రాజశేఖర్‌పై ఫైర్‌ అవుతున్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌.. అసలేం జరిగింది?


సినిమా రంగంలో హీరోలైనా, హీరోయిన్‌లైనా అందంగా కనిపించాలి. దానికి తోడు అభినయం కూడా బాగుండాలి. స్క్రీన్‌పై అందంగా కనిపించాలని ఏ హీరోకైనా, హీరోయిన్‌కైనా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ పెడుతుంటారు. అందమైన ఫిజిక్‌ కోసం తమ ఇష్టాలను, అభిరుచులను కూడా త్యాగం చేస్తుంటారు. మరికొందరు తమ శరీర భాగాలను ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా మార్చుకుంటారు. 40 ఏళ్ళ క్రితమే స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి ముక్కుకి సర్జరీ చేయించుకొని తన అందాన్ని రెట్టింపు చేసుకుంది, అతిలోక సుందరి అనిపించుకుంది. అప్పట్లో ఇది ఒక సంచలన వార్త. ఆ తర్వాతి రోజుల్లో ఇలాంటి సర్జరీలు సినిమా సెలబ్రిటీస్‌కి సర్వసాధారణం అయిపోయాయి. 

సర్జరీలు చేయించుకోవడం ద్వారా తమ శరీరంలో ఉన్న కొన్ని లోపాలను సరిచేసుకున్న హీరోలు, హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో అల్లు అర్జున్‌ కూడా ఒకరు. అతనికి కూడా ప్లాస్టిక్‌ సర్జరీ జరిగిందనే వార్త అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అదిప్పుడు ప్రస్తావనకు రావడానికి కారణం ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో వచ్చిన ఓ డాక్టర్‌ ఇంటర్వ్యూ. కాస్మొటిక్‌ సర్జన్‌ అయిన డా. రాజశేఖర్‌ గొల్లు నటీనటుల ప్లాస్టిక్‌ సర్జరీలపై పలు వ్యాఖ్యలు చేశారు. సినిమా స్టార్స్‌ మాత్రమే కాదు, బిగ్‌బాస్‌ స్టార్స్‌ కూడా సర్జరీ కోసం తన దగ్గరకు వస్తారని చెప్పారు డా. రాజశేఖర్‌. దుల్కర్‌ సల్మాన్‌, దీపికా పదుకొణె, అమీ జాక్సన్‌, శోభిత దూళిపాళ్ళ వంటి స్టార్స్‌ సర్జరీలు చేయిచుకున్నారని చెప్పారు. అంతేకాదు, సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత అంటూ వారి ఫోటోలను చూపించి మరీ వివరించారు. ప్రత్యేకించి అల్లు అర్జున్‌ గురించి తెలియజేస్తూ ‘ముక్కుకి, లిప్స్‌కి సర్జరీ జరిగింది. నాకు ఉన్న నాలెడ్జ్‌ ప్రకారం అది క్లియర్‌’ అని కన్‌ఫర్మ్‌ చేశారు. 

ఇంతవరకు బాగానే ఉంది గానీ ఇప్పుడు ఆ డాక్టర్‌ కామెంట్స్‌ మాత్రం వైరల్‌ అవుతున్నాయి. ఎంతో మంది సర్జరీ చేయించుకున్నారని చెబుతూ వారి వారి ఫోటోలను చూపించినా బన్నీకి సంబంధించి డాక్టర్‌ చెప్పిన దాన్నే సోషల్‌ మీడియాలో ఎక్కువగా వైరల్‌ చేస్తున్నారు. అయితే ఇదంతా యాంటీ ఫ్యాన్స్‌ చేస్తున్న పనేనని, బన్నీ ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ హీరోగా తనేమిటో ప్రూవ్‌ చేసుకున్న అల్లు అర్జున్‌లోని లోపాల గురించి ఎత్తి చూపడం ఇప్పుడు అవసరమా అని కొందరంటుంటే.. ఆ డాక్టర్‌ ఎంతో మంది సెలబ్రిటీల గురించి మాట్లాడినా.. బన్నీని మాత్రమే టార్గెట్‌ చేస్తూ దాన్ని వైరల్‌ చెయ్యడం కరెక్ట్‌ కాదని అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. 



Source link

Related posts

'ఓజీ' నుంచి మెంటలెక్కించే పోస్టర్

Oknews

Weather in Telangana Andhrapradesh Hyderabad on 9 March 2024 Summer updates latest news here | Weather Latest Update: తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి, నేటి వాతావరణం ఇలా

Oknews

Divorce with Aish: Abhishek Bachchan Fire ఐష్ తో విడాకులు: అభిషేక్ ఫైర్

Oknews

Leave a Comment