సినిమా సెకండాఫ్ బాగుంటే చాలు Great Andhra


సినిమాలు చూసేవాళ్లకు ఓ పాయింట్ బాగా తెలుసు. ఫస్ట్ హాఫ్ సో సో గా గడిచిపోయినా, సెకండాఫ్ మాత్రం అదిరిపోవాలి. కనీసం ఫస్ట్ హాఫ్ కన్నా బెటర్ అనిపించుకోవాలి. ముఖ్యంగా క్లయిమాక్స్, ప్రేక్షకులు ఇంటికి ఓ ఫీల్ తో వెళ్లాలి. అదీ సక్సెస్ ఫార్ములా. ఈ ఫార్ములా తెలియకనే ఎక్స్ సిఎమ్ జ‌గన్ బోర్లాపడ్డారు. ఈ ఫార్ములా బాగా తెలిసిన చంద్రబాబు సిఎమ్ అయ్యారు. మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

జ‌గన్ ఏం చేసారు. వస్తూనే అన్ని పథకాలు టప టప అమలు చేసేసారు. అప్పులు చేసుకుంటూ బటన్ నొక్కుకుంటూ వెళ్లిపోయారు. సరైన వాళ్లను చూసి మంత్రులను చేసారు. ఇదంతా ఫస్ట్ హాఫ్.

రెండున్నరేళ్లు వచ్చేసరికి, చాలా మంది మంత్రులను పీకేసి, కొత్తవాళ్లను తెచ్చారు. దాంతో అంతో ఇంతో సమర్ధులైన సదరు మాజీ మంత్రులంతా సైలంట్ అయిపోయారు. చివరి రెండున్నర సంవత్సరాల్లో జ‌గన్ చేసింది ఏమీ కనిపించలేదు. పైగా ఈ రెండున్నరేళ్ల సెకెండాఫ్ ను చంద్రబాబు వాడుకున్నారు.

జ‌గన్ బటన్ నొక్కడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. రోడ్లు పాడయ్యాయి అన్నారు. రాష్ట్రం అప్పుల పాలయింది అన్నారు. ఇలా రకరకాలుగా, చివరి ఏడాదిలో అంటే క్లయిమాక్స్ లో ముప్పేట దాడి చేసారు. అటు మీడియా, ఇటు వివిధ పార్టీలు, వివిధ వర్గాలు ఇలా మొత్తం మీద పడిపోయారు. జ‌గన్ ఓడిపోయారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సినిమా ఆరంభం అలా అలా అంతంత మాత్రంగా వుంటే చాలు క్లయిమాక్స్ కీలకం, సెకండాఫ్ ముఖ్యం అని తెలుసు కదా. అందుకే నిదానంగా ముందుకు వెళ్తున్నారు. సింపుల్ గా అయిపోయే అన్న క్యాంటీన్, ఇసుక ఫ్రీ ఇచ్చి ఊరుకుంటున్నారు. అమ్మ ఒడి, బస్ ఫ్రీ ఇలా చాలా పనులు, పథకాలు వున్నాయి. అవి అన్నీ పక్కన పెట్టారు. డబ్బులు లేవు కదా.

తొలి ఏడాది గోల పెడతారు. మలి ఏడాది కొంచెం ఇస్తారు.. కొంచెం గోల వుంటుంది. తరువాత మరి కొంచెం, ఆపై ఇంకొంచెం ఇలా విడతలు విడతలుగా ఇస్తూ వెళ్తారు. అయిదేళ్ల క్లయిమాక్స్ టైమ్ కు అన్ని హామీలు నిలబెట్టుకున్నా అనిపించుకుంటారు. ఇంక అప్పుడేముంది? జ‌గన్ విమర్శించడానికి ఏమీ మిగలదు. జ‌నం కూడా ఇచ్చిందే గుర్తు వుంచుకుంటారు. వస్తూనే ఇవ్వని సంగతి పక్కన పెడతారు. ఎంతయినా క్లయిమాక్స్, సెకండాఫ్ ఇంపాక్ట్ వేరు కదా.

ఈ ధర్మ స్మూక్ష్మం తెలియక సెకండాఫ్ ను పాడు చేసుకున్నాను. అందరినీ దూరం చేసుకున్నాను. అన్నీ ముందే ఇచ్చేసాను అని అనుకుంటూ దిగాలు పడడం తప్ప జ‌గన్ చేసేదేమీ లేదు.



Source link

Leave a Comment