Health Care

Delivery : డెలివరీ తర్వాత ఈ విషయాల్లో జాగ్రత్త.. లేకపోతే సమస్యలే!


దిశ, ఫీచర్స్ : తల్లి కావడం ప్రతి తల్లికి గొప్ప వరం. ఇక తాను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి మహిళ తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే, ఆ సమయంలో, మానసిక, శారీరక ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. అంతే కాకుండా డెలివరీ తర్వాత కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో నార్మల్ డెలివరీ అయిన వారు, తమ యోని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట. లేకపోతే ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. కాగా, యోని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • యోనిని రోజుకు రెండు సార్లు వేడి నీటితో శుభ్రం చేసుకోవాలంట. అంతే కాకుండా డెలివరీ సమయంలో ఎక్కువగా రక్తస్రావం అవుతుంది. అందువల్ల చాలా త్వర త్వరగా ప్యాడ్ మార్చుకుంటూ.. పరిశుభ్రతను పాటించాలంట.
  • నార్మల్ డెలివరీ సమయంలో యోని దగ్గర కుట్లు వేస్తుంటారు. అయితే దీని వలన అధికంగా నొప్పి ఉండటం, పలు రకాల ఇబ్బందులు ఉంటాయి. అందువలన బిగుతుగా ఉండేవి కాకుండా వదులుగా ఉండే దుస్తులు వాడాలంట. అలాగే మూత్ర విసర్జన చేసిన తర్వాత తప్పకుండా యోనిని శుభ్రపరుచుకోవాలంట , లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు నిపుణులు.
  • నార్మల్ డెలివరీ అయిన మహిళలు రోజుకు రెండు సార్లు తప్పకుండా వేడి వేడి నీటితో స్నానం చేయాలంట. దీనివలన ఒళ్లు నొప్పులు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
  • నార్మల్ డెలివరీ అయిన వారు కూర్చునె విషయంలో కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సుఖాసనంలో కూర్చోకూడదు. అలాగే నేల మీద కూడా అస్సలే కూర్చోకూడదు.

డెలివరీ తర్వాత మహిళలు మంచి ఆహారం తీసుకోవాలి. కొంత మంది మహిళలు నొప్పుల బాధతో సరిగ్గా ఆహారం తీసుకోరు కానీ అలా చేయకూడదు అంటున్నారు వైద్యులు.



Source link

Related posts

బర్రెలక్క ప్రీ-వెడ్డింగ్ షూట్ (వీడియో).. ఆమెకు కాబోయే భర్త బ్యాక్‌గ్రౌండ్ నెట్టింట వైరల్

Oknews

ఈ లక్షణాలు ఉన్న మగవారు జర జాగ్రత్త.. గుర్తించకపోతే ప్రమాదమే?

Oknews

బడిలో మొదలైన ప్రేమ.. చివరకు మూడు ముళ్లతో ఏకమైన రాధిక, అనంత్ అంబానీ!

Oknews

Leave a Comment