Health Care

Thyroid : థైరాయిడ్ సమస్య పెరిగిపోతుందా.. కారణం ఇదేనేమో!


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి.దీని వలన మహిళలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. మనం తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని కారణాల వలన కూడా థైరాయిడ్ అనేది ప్రభావితం అవుతుందంట. ఇంతకీ ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అధిక ఒత్తిడి : చాలా మంది చిన్న చిన్న విషయాలకు కూడా వట్టిగనే స్ట్రెస్‌కు గురి కావడం జరుగుతుంది. దీని వలన కూడా థైరాయిడ్ పనితీరులో మార్పులు వచ్చి, ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందంట.

డయాబెటీస్ : థైరాయిడ్ షుగర్ లెవెల్స్‌ను ప్రభావతం చేస్తుంది. అయితే డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి కూడా హైపోథైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట.

జంక్ ఫుడ్ : మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్‌‌కు ఎక్కువ అలవాటు పడుతున్నారు. అయితే దీని వలన కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్, సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిద్ర లేమి : కంటినిండా నిద్రపోవడం, టైమ్‌కి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇప్పుడు చాలా మంది, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో అస్సలే నిద్రపోవడం లేదు. అయితే ఇది కూడా థైరాయిడ్ రావడానికి ఒక కారణం అంట.

(నోట్ :పై వార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)



Source link

Related posts

గుడ్ ఫ్రైడే ప్రత్యేకత.. ఈరోజు చేపలే ఎందుకు తింటారు?

Oknews

మీ చుట్టూ ఉండే అబద్ధాలకోరును ఇలా పట్టేయొచ్చు…

Oknews

డయాబెటీస్‌తో బాధపడే వారికి ఏ పాలు మంచివో తెలుసా?

Oknews

Leave a Comment