బిగ్ బాస్ ఫీవర్ మళ్లీ ఊపందుకుంటోంది


బిగ్ బాస్ కొత్త సీజన్ షురూ అయిన ప్రతిసారి సోషల్ మీడియాలో హంగామా మాములుగా ఉండదు. అప్పటివరకు కనిపించని ఎకౌంట్లు, గ్రూపులు సడెన్ గా తెరపైకొస్తాయి. కామెంట్లు, మీమ్స్, క్లిప్పింగ్స్ తో కొట్టుకుంటాయి. ఆ మజాను ఎంజాయ్ చేసే సెక్షన్ సెపరేట్ గా ఉంది.

టీఆర్పీ పరంగా సీజన్-7 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సీజన్-8పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే పుకార్లు కూడా ఊపందుకున్నాయి. ప్రతి సీజన్ కు ఉన్నట్టుగానే, ఈసారి కూడా ప్రారంభానికి ముందే హౌజ్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనే అంశంపై జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి.

సీజన్-8కి సంబంధించి ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈసారి అమృతా ప్రణయ్, అలీ తమ్ముడు ఖయ్యుం, మై విలేజ్ షో ఫేమ్ అనీల్, స్వాతి నాయుడు, సోనియా సింగ్ లాంటి వాళ్లు బిగ్ బాస్ హౌజ్ లో కనిపించే అవకాశం ఉంది.

వీళ్లతో పాటు ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన కుమారి ఆంటీ కూడా హౌజ్ లో ప్రత్యక్షమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే, ఈమె ఇప్పటికే సదరు ఛానెల్ లో ప్రసారమైన పలు కార్యక్రమాల్లో కనిపించింది.

ఈమెతో పాటు వినోద్ కుమార్, అంబటి రాయుడు, అబ్బాస్, నటుడు రోహిత్ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్లు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటరవ్వడం దాదాపు పక్కా అంటున్నారు.

ఇక సీజన్-8కు గ్లామర్ జోడించే బాధ్యతను ఈసారి విష్ణు ప్రియ, రీతూ చౌదరి తీసుకున్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో చిట్టిపొట్టి దుస్తులు వేసుకొని హంగామా చేసే ఈ బెస్ట్ ఫ్రెండ్స్.. బిగ్ బాస్ హౌజ్ ను వేడెక్కించడం ఖాయం అంటున్నారు ఈ సెక్షన్ జనం. అయితే అదింకా కన్ ఫర్మ్ కాలేదు.

గత సీజన్ ఇచ్చిన ఉత్సాహంతో ఈసారి బిగ్ బాస్ ను మరింత స్పైసీగా మార్చబోతున్నారట నిర్వహకులు. కంటెస్టెంట్ల మధ్య పెట్టే పోటీలు, అడిగే ప్రశ్నలతో పాటు.. కొత్త స్కిట్లు యాడ్ చేస్తున్నారు. దీనికితోడు ఈసారి 2 బిగ్ బాస్ హౌజ్ లు ఏర్పాటుచేసే ఆలోచన కూడా చేస్తున్నారట. ఇంతకీ ఈసారి నాగార్జున ఎలా ప్రిపేర్ అవుతారో చూడాలి.

The post బిగ్ బాస్ ఫీవర్ మళ్లీ ఊపందుకుంటోంది appeared first on Great Andhra.



Source link

Leave a Comment