EntertainmentLatest News

‘ది జర్నీ ఆఫ్‌ విశ్వం’ అదిరింది.. గోపీచంద్‌, శ్రీను వైట్ల హిట్‌ కొట్టడం ఖాయమట!


యాక్షన్‌ విత్‌ కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌ అంటే శ్రీను వైట్ల(srinu vaitla) పేరే వినిపిస్తుంది. ఆ తరహా సినిమాలతో భారీ హిట్స్‌ అందుకున్న డైరెక్టర్‌ అతను. అలాంటి సినిమాలతో ఒక ట్రెండ్‌ని క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత అతని బాటలోనే ఎంతో మంది దర్శకులు యాక్షన్‌, కామెడీని మిక్స్‌ చేస్తూ ఎన్నో సినిమాలు రూపొందించారు. అయితే కాలక్రమేణా ఆ ట్రెండ్‌ కనుమరుగవుతూ వస్తోంది. శ్రీను వైట్లకు కూడా సక్సెస్‌ కరువైపోయింది. ఎన్నో ఏళ్ళుగా మంచి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. అలాగే యాక్షన్‌ సినిమాల్లో తన సత్తా చాటుతూ ఎన్నో సూపర్‌హిట్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు గోపీచంద్‌(Gopichand). గత కొంతకాలంగా అతనికి కూడా సరైన హిట్‌ లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ భారీ యాక్షన్‌ సినిమాగా ‘విశ్వం’ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. శ్రీను వైట్లకు, గోపీచంద్‌కి తప్పకుండా పెద్ద సక్సెస్‌ వస్తుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ‘విశ్వం’ మేకర్స్‌ ‘ది జర్నీ ఆఫ్‌ విశ్వం’ పేరుతో ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది, ఏయే లొకేషన్స్‌లో సినిమాను షూట్‌ చేశారు, ఏయే అంశాలు సినిమాలో ఉన్నాయనే విషయాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగాన్ని ఇటలీలోనే చేశారని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. 

తన తిరగులేని ఫార్ములా అయిన కామెడీని ఈ సినిమాలో కూడా శ్రీను వైట్ల జొప్పించారనే విషయం ఈ వీడియోలో అర్థమవుతుంది. ‘వెంకీ’ చిత్రంలో సుదీర్ఘంగా సాగే ట్రైన్‌ ఎపిసోడ్‌ అప్పట్లో గొప్ప సంచలనం సృష్టించింది. మళ్ళీ దాన్నే ఈ సినిమాలో కూడా రిపీట్‌ చేస్తున్నామని ఈ వీడియోలో స్పష్టం చేశారు. ఈ ట్రైన్‌ ఎపిసోడ్‌లో నరేష్‌, వెన్నెల కిషోర్‌, అజయ్‌ ఘోష్‌, ప్రగతి, రచ్చ రవి తదితరులు కనిపించారు. హీరో గోపీచంద్‌కి, దర్శకుడు శ్రీను వైట్లకి తప్పనిసరిగా ఒక మంచి సూపర్‌హిట్‌ అవసరం. దాని కోసం ఇద్దరూ బాగా కష్టపడ్డారనే విషయం కూడా అర్థమవుతోంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లో, కామెడీ సన్నివేశాల్లో గోపీచంద్‌ తనదైన స్టైల్‌లో నటించాడు. ఇక శ్రీను వైట్ల కొన్ని రిస్కీ లొకేషన్స్‌లో కూడా షూటింగ్‌ జరిపారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఎనౌన్స్‌ చేసే అవకాశం ఉంది. గోపీచంద్‌, శ్రీను వైట్ల ఇంత కష్టపడి చేస్తున్న ఈ సినిమా వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 



Source link

Related posts

మహేష్ బాబు,సూర్య కి అభిమానులు గుడి కడతారా!

Oknews

రూపాన్ని మార్చుకోవడం కోసం ఆస్ట్రేలియాకు రామ్ చరణ్!

Oknews

గామి ని కాంతార లాగా ఆదరిస్తే అక్కడ కూడా రిలీజ్ ఉంటుంది

Oknews

Leave a Comment