దిశ, ఫీచర్స్: ఆపరేషన్ కోసం హాస్పిటల్ కు వెళ్తే ప్రాణాలతో వస్తామో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. చిన్న సర్జరీ అయినా సరే స్మాల్ మిస్టేక్ తో లైఫ్ ఎండ్ అయిపోయే ప్రమాదాలు కూడా చూశాం. అంతెందుకు సర్జరీ చేసి పొట్టలోనే దూది మరిచిపోయే నిర్లక్ష్యపు డాక్టర్లను కూడా చాలా మంది ఉన్న ఈరోజుల్లో.. టెక్నాలజీ సాయంతో ఏకంగా ఐదు వేల కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ చేసి శభాష్ ఆనిపించుకుంటున్నారు చైనీయులు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
చైనాలోని జిన్‌జియాంగ్‌లో 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్జన్‌తో రిమోట్ రోబోటిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. 5G పవర్ తో పనిచేసే రోబోటిక్ సర్జరీ టెక్నాలజీ సహాయంతో.. సుదూర యురాలాజిక్ ఆపరేషన్ కంప్లీట్ చేశారు. నార్త్ వెస్ట్ చైనాలో రోబో ఆపరేషన్ చేస్తుండగా.. సౌత్ చైనా నుంచి సూచనలు ఇచ్చాడు డాక్టర్. మొత్తానికి మెడికల్ ఇన్నోవేషన్ లో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ సాంకేతికత.. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో గణనీయమైన మార్పులు తీసుకురానుందని అంటున్నారు నిపుణులు. రిమోట్ రిజియన్స్ లో ఉండే ప్రజలు హై క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ పొందగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.