దిశ, ఫీచర్స్: అమ్మాయిలకు నెలసరి వచ్చినప్పుడు కడుపు నొప్పి రావడం సహజం. ఈ నొప్పి రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను దూరం పెట్టాలి. ముఖ్యంగా, పుల్లటి పదార్ధాలను దగ్గరకు రానివ్వకూడదు. ఇది కడుపులో మంటను పెంచే అవకాశం ఉంది. కాబట్టి, పీరియడ్స్ సమయంలో పచ్చళ్ళు, పుల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒక వేళ వీటిని తీసుకుంటే మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
చర్మంపై ప్రభావం:
పీరియడ్స్ టైంలో హార్మోన్ల మార్పులు రావడం వలన మొఖంపై మొటిమలను కలిగిస్తాయి. ఆ సమయంలో నిమ్మకాయ, చింతపండుతో చేసిన ఆహారాలను తీసుకోకూడదు. దీని వలన ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.
మూడ్ స్వింగ్స్:
నెలసరి టైంలో మూడ్ స్వింగ్స్ సాధారణం. పుల్లటి పదార్ధాలు తినడం వలన కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. దాని వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కోపం ఎక్కువయ్యి చిన్న వాటికే విసుక్కుంటారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.