గీతా సంస్థ నాగ్ చైతన్య- చందు మొండేటి కాంబినేషన్ లో నిర్మిస్తున్న సినిమా తండేల్. శ్రీకాకుళం నుంచి పాకిస్ధాన్ వరకు సాగే కథ ఇది. ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు. ఎక్కడా రాజీ పడడం లేదు.
సినిమా ప్రారంభించేటపుడే కాస్త భారీ సినిమా అని తెలుసు. కానీ ఇప్పుడు ఇంకా భారీ అని అర్థం అవుతోంది నిర్మాతలకు. దాదాపు 80 కోట్లు దాటి ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు ఈ సినిమాకు.
చైతన్య సినిమాల్లోనే ఇంత భారీ సినిమా మరోటి లేదు. ఓటిటి, హిందీ హక్కులు ఇలాంటి ఇన్ కమ్ వుంది కానీ, ఏమైనా 80 కోట్లు అంటే చైతన్య మీద బెట్ పెట్టినట్లే. ఇప్పటికే ఓటిటి హక్కులు మంచి రేటు అమ్మారు. వన్ థర్డ్ కవర్ ఖర్చు దాదాపుగా కవర్ అయినట్లే. హిందీ డబ్బింగ్ హక్కులు విక్రయించాల్సి వుంది. అడియో, శాటిలైట్ హక్కులు పూర్తయితే థియేటర్ మీద ఓ ఇరవై కోట్ల బర్డెన్ వుంటుంది. తరువాత లాభాలు.
సినిమాలో కీలక సన్నివేశాలు సముద్రం మీద వుండడం, సిజీ వర్క్ ఎక్కువ వుండడం, అలాగే భారీ సెట్లు అవసరం కావడంతో సినిమాకు ఖర్చు పెరుగుతూ వస్తోంది. అయినా కూడా సబ్జెక్ట్ మీద నమ్మకంతో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్ ఖర్చుకు వెనుకాడకుండా ముందుకు వెళ్తున్నారు. కార్తికేయ2 తరవాత దర్శకుడు చందు మొండేటి చేస్తున్న సినిమా ఇది.