ఎన్నాళ్లకు ఎన్టీఆర్ అందంగా..


2018 లో వచ్చింది అరవింద సమేత. సీరియస్ గా కనిపించినా అందంగా కనిపించాడు ఎన్టీఆర్. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ పనిలో పడిపోయాడు. అందులో కొమరం భీమ్ గా బలంగా, సీరియస్ గా, అక్కడక్కడ విషాదంగా కనిపించాడు. ఎన్టీఆర్ అందంగా నవ్వి, అందంగా రొమాన్స్‌ చేసి, ఎన్నాళ్లయిందో తెరమీద చూసి. ఇప్పుడు అంటే దాదాపు ఆరేళ్ల తరువాత కనిపించాడు. దేవర సినిమా నుంచి రెండో పాట వచ్చింది బయటకు.

ఎన్టీఆర్-జాహ్నవి కలిసి చేసిన రొమాంటిక్ సాంగ్. అమ్మాయి మాంచి ఫీల్ తో, రొమాంటిక్ గా, కథానాయకుడి జ‌త కోరుతూ పాడిన పాట. ఈ పాటలో ఎన్టీఆర్ అందంగా కనిపించాడు. పెద్దగా మాస్ బీట్ కాదు. మాస్ స్టెప్ట్ కాదు. అయినా కూడా ఫ్యాన్స్ ఫిదా. ఎందుకు అంటే ఎన్టీఆర్ ను ఇలా చూసి ఆరేళ్లు అయిపోయింది కనుక. అందుకే యాంటీ ఫ్యాన్స్ కాపీ సాంగ్ అని ట్రోల్ చేసినా, పాట మరీ స్లోగా వుంది అని కామెంట్ చేసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫీల్ కావడం లేదు.

పాట పిక్చరైజేషన్ బాగుంది. కలర్ ఫుల్ గా వుంది. జాహ్నవి కపూర్ తెలుగులో చేసిన తొలి పాట ఇది. స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా వుంటుందో అన్న అనుమానం వుంది. కానీ ఈ కాస్ట్యూమ్స్ లో జాహ్నవి బాగానే వుంది. స్పెప్ట్స్ స్పీడ్ గా వుంటే బాగానే వుండేది. కానీ పాట అలాంటిది కాదు. మరో పాటలో జాహ్నవి డ్యాన్స్ స్పీడ్ ను చూసే అవకాశం కొరటాల శివ కల్పిస్తారేమో? ఈ పాట ఎందుకు, ఇలా డిజైన్ చేసి వుంటారు అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్రస్తుతానికి అయితే పెద్ద డిస్సపాయింట్ మెంట్ ఏమీ కాదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు హ్యాపీనే. అది చాలు యూనిట్ కు.

The post ఎన్నాళ్లకు ఎన్టీఆర్ అందంగా.. appeared first on Great Andhra.



Source link

Leave a Comment