EntertainmentLatest News

అల్లు అర్జున్ ని పూర్తిగా పక్కన పెట్టేసిన మెగా ఫ్యామిలీ.. నిహారిక ఉద్దేశం అదేనా..?


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ (Allu Arjun) మద్దతు తెలపడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఎందరో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బన్నీ తీరుని తప్పుబట్టారు. కొందరు మెగా కుటుంబసభ్యులు సైతం బన్నీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. సాయి ధరమ్ తేజ్ ఏమో సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చేశాడు. ఇక ఇప్పుడు నిహారిక (Niharika) సైతం.. అల్లు అర్జున్ ఘనతను మెగా ఖాతాలో వేయడానికి ఇష్టపడలేదు.

యాంకర్ గా, నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నిహారిక.. నిర్మాతగానూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు నిర్మించి తన టేస్ట్ చాటుకున్న నిహారిక.. ఇప్పుడు మొదటిసారి ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే ఫీచర్ ఫిల్మ్ నిర్మించింది. ఈ సినిమా ఆగష్టు 9న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. 

ఈ ఈవెంట్ లో నిహారిక మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ప్రస్తుతం మెగా టైం నడుస్తోంది. మా చరణ్ అన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ కి వెళ్ళింది. మా పెదనాన్న చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చింది. మా బాబాయ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇదే ఊపులో నేను నిర్మించిన మొదటి ఫీచర్ ఫిల్మ్ ని హిట్ చేసేయండి.” అని నిహారిక మాట్లాడింది. 

అయితే ఆమె స్పీచ్ లో అల్లు అర్జున్ నేమ్ మిస్ అయింది. ‘పుష్ప’ చిత్రానికి గాను బన్నీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరో అల్లు అర్జునే. అంతటి ఘనత సాధించిన ఆయన పేరుని నిహారిక చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిహారిక పొరపాటున బన్నీ పేరు మర్చిపోయిందా? లేక ఆయన మెగా హీరో కాదనే విషయాన్ని తెలుపుతూ ఉద్దేశపూర్వకంగా ఇలా చేసిందా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.



Source link

Related posts

ప్రముఖ నటి, దర్శకురాలు ఆకస్మిక మరణం

Oknews

బీ రెడీ.. ‘సలార్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

Oknews

ఎమ్మెల్యే లాస్య నందిత పాడె మోసిన హరీశ్ రావు

Oknews

Leave a Comment