హాట్ హీరోయిన్ కు వరుస ఫ్లాపులు Great Andhra


ఇదంతా సోషల్ మీడియా యుగం. క్రేజ్ సంపాదించుకోవడానికి సోషల్ మీడియా ఓ మార్గం. జాన్వి కపూర్ కూడా అలా చాలా క్రేజ్ తెచ్చుకుంది. కానీ సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం ఆమెకు విజయాల కంటే, ఫ్లాపులే ఎక్కువ. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ ఫ్లాపుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.

తాజాగా హిందీలో ‘ఉలజ్’ అనే సినిమా చేసింది జాన్వి కపూర్. ఈ సినిమా కోసం ఆమె గట్టిగా ప్రచారం కూడా చేసింది. కానీ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. ఎంతలా అంటే ఉలజ్ కు ఓపెనింగ్స్ కూడా రాలేదు. జాన్వి కపూర్ ఫ్యాక్టర్ ఈ సినిమాకు ఏమాత్రం కలిసిరాలేదు.

ఈ సినిమా రిలీజై 4 రోజులైంది. ఈ 4 రోజుల్లో సినిమాకు వచ్చిన వసూళ్లు 5 కోట్ల 50 లక్షలు. అంటే, జాన్వి రెమ్యూనరేషన్ డబ్బులు కూడా వెనక్కు రాలేదన్నమాట. ఇక నాలుగో రోజైన సోమవారం ఈ సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు కేవలం 60 లక్షల రూపాయలు.

అలా జాన్వి కపూర్ ఖాతాలోకి మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఈ ఏడాది మాత్రమే కాదు, ఆమె కెరీర్ లోనే ఇప్పటివరకు సాలిడ్ హిట్ పడలేదు. ఉలజ్ ఫ్లాప్ తో జాన్వికి ఈ ఏడాది మిగిలిన ఏకైక అవకాశం దేవర-1 మాత్రమే.



Source link

Leave a Comment