బిగ్ బాస్ కు కమల్ హాసన్ షాక్ Great Andhra


హౌజ్ లో అందరికీ బిగ్ బాస్ షాకిస్తుంటాడు. కానీ ఇక్కడ రివర్స్ లో బిగ్ బాస్ కు కమల్ హాసన్ షాకిచ్చారు. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ గా ప్రారంభం కానున్న కొత్త సీజన్ కు తను వ్యాఖ్యాతగా వ్యవహరించలేనని తేల్చి చెప్పేశారు. దీనికి సంబంధించి కమల్, అధికారికంగా ఓ లేఖ కూడా రిలీజ్ చేయడం విశేషం.

తమిళనాట బిగ్ బాస్ అంటే కమల్.. కమల్ అంటే బిగ్ బాస్. అంతలా ఆ షోతో మమేకమయ్యారు. ఒక్కోసారి కంటెస్టెంట్స్ లో ఒకరిగా మారిపోయి కమల్ చేసిన అల్లరి హైలెట్ గా నిలిచింది. మరికొన్నిసార్లు ఆయన చెప్పే తెరవెనక విశేషాలు ఎంతోమందిని కదిలించాయి.

ఇలా నవ్విస్తూ, ఎమోషన్ కు గురిచేస్తూ అద్భుతంగా షో నడిపించిన కమల్ హాసన్.. కొత్త సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

“ప్రియమైన వీక్షకులారా, 7 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మన ప్రయాణం నుండి నేను చిన్న విరామం తీసుకుంటున్నాను. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. ముందుగా అనుకున్న సినిమా కమిట్‌మెంట్‌ల కారణంగా, నేను బిగ్ బాస్ తమిళ్ రాబోయే సీజన్‌కి హోస్ట్ గా చేయలేకపోతున్నాను.”

ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు కమల్. ఆయన విలన్ పాత్ర పోషించిన కల్కి సినిమా దేశవ్యాప్తంగా పెద్ద హిట్టయింది. అదే టైమ్ లో శంకర్ దర్శకత్వంలో ఆయన చేసిన ఇండియన్-2 సినిమా ఫెయిలైంది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో ఆయన థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు. ఇండియన్-3 కూడా పైప్ లైన్లో ఉంది. వీటితో పాటు కొత్తగా మరో 2 సినిమాల్ని ఆయన ప్రకటించడానికి రెడీ అవుతున్నారు.



Source link

Leave a Comment