చంద్రబాబు సర్కార్ మరో ఎన్నికల హామీని నెరవేర్చడానికి నిర్ణయించింది. ఆర్థికంగా భారం కాని పనుల్ని త్వరగా చేయాలని ఇప్పటికే చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి హామీ నెరవేరబోతోంది.
ముగ్గురు పిల్లలున్న వాళ్లెవరైనా స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే సంగతి తెలిసిందే. ఈ నిబంధనను ఎత్తి వేయాలని తాజాగా చంద్రబాబు సర్కార్ బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం విశేషం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముగ్గురు పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత చట్టాన్ని ఎత్తివేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కూటమి అధికారంలోకి రావడం, స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఏడాది లేదా ఏడాదిన్నరలో జరగనున్న నేపథ్యంలో నిబంధన సడలింపుపై గ్రామ, మండల స్థాయి నాయకుల దృష్టి పడింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అనర్హత నిబంధనను ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించనున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం ఉన్న వారికి చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించినట్టైంది.
The post ముగ్గురు పిల్లలున్నా… పోటీకి గ్రీన్ సిగ్నల్! appeared first on Great Andhra.