స్కంద సినిమా కోసం కాస్త కండలు పెంచి లావుగా తయారయ్యాడు రామ్. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వచ్చేశాడు. అయితే డబుల్ ఇస్మార్ట్ లో జాయిన్ అయ్యే టైమ్ కు మళ్లీ స్లిమ్ అయ్యాడు. ఆల్ మోస్ట్ సిక్స్ ప్యాక్ ఫిజిక్ లోకి వచ్చేశాడు.
ఇదెలా సాధ్యమైంది. ఇందులో ఎలాంటి గ్రాఫిక్స్ లేవంటున్నాడు రామ్. డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం కేవలం నెల రోజుల్లో బరువు తగ్గానని వెల్లడించాడు. స్కంద పూర్తయ్యేసరికి 86 కిలోలున్న రామ్, డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వచ్చేసరికి అమాంతం 68 కిలోలకు తగ్గాడు.
“పూరి జగన్నాధ్ చెప్పిన క్లయిమాక్స్ కు కిక్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ క్లయిమాక్స్ ఎలా ఉందో, దాదాపు అలానే షర్ట్ లేకుండా చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఆ క్లయిమాక్స్ పార్ట్ నవంబర్ లోనే షూట్ చేయాలి. ఎందుకంటే సీజీ వర్క్ ఉంది, సంజయ్ దత్ కాల్షీట్లు కూడా మళ్లీ దొరకవు. స్కంద రిలీజైన తర్వాత నాకు 2 నెలలు మాత్రమే టైమ్ ఉంది. బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లాను. అక్కడే నెల రోజులుండి గట్టిగా వర్కవుట్ చేసి బరువు తగ్గాను.”
ఇస్మార్ట్ శంకర్ లో తన పాత్ర బాగా క్లిక్ అయిందని… మళ్లీ ప్రేక్షకులకు ఆ ఫీల్ రావాలంటే అదే ఫిజిక్ చూపించాలని.. అందుకే అంత తక్కువ టైమ్ లో ఎక్కువ బరువు తగ్గానని అన్నాడు. అయితే ఇలా తక్కువ టైమ్ లో బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదకరమని, తనలా ఎవ్వరూ ప్రయత్నించొద్దని కూడా సూచిస్తున్నాడు.
The post 86 నుంచి 68కి.. 2 నెలల్లో appeared first on Great Andhra.