చలికాలంలో వెల్లుల్లి ఎందుకు తినాలి? ఈ కారణాలు తెలుసుకోండి!


posted on Nov 27, 2024 9:30AM

వెల్లుల్లి వంటింట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఏ కొద్దిమందో వెల్లుల్లికి దూరంగా ఉంటారు. ఇది సీజన్ తో సంబంధం లేకుండా వాడుతుంటారు. వెల్లుల్లి లేని వంటను   ఇష్టపడని పరిస్థితితో చాలామంది ఉన్నారు.  ఇది బలమైన రుచి,  ఘాటైన  సువాసన కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం.  జలుబు,  దగ్గును నయం చేయడంలో వెల్లుల్లి అద్భుతాలు చేస్తుంది. శీతాకాలం అంతటా ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్,  యాంటీ ఫంగల్ లక్షణాలు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి. వెల్లుల్లిలో మాంగనీస్, పొటాషియం, ఐరన్, కాల్షియం,  విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. చలికాలంలో వెల్లుల్లి ఎందుకు తినాలో కింది కారణాల చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

యాంటీఆక్సిడెంట్ & యాంటీ బాక్టీరియల్ లక్షణాలు

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి  ఆరోగ్యంగా ఉంచుతాయి.  జలుబు,  దగ్గు వంటి వ్యాధులను నివారిస్తాయి. వెల్లుల్లిని ‘మ్యాజిక్ పదార్ధం’గా పరిగణిస్తారు, ఇది కాలానుగుణ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో అద్బుతంగా సహాయపడుతుంది.  తరచుగా జలుబు, దగ్గు వస్తుంటే  వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

గుండె ఆరోగ్యం

 గుండె జబ్బులతో బాధపడే వారికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే స్ట్రోక్, గుండెపోటుతో సహా  ఇతర గుండె సంబంధించిన  సమస్యల  ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా,  రక్తపోటు, కొలెస్ట్రాల్,  రక్తంలో చక్కెరను తగ్గించాలనుకున్నా  ప్రతిరోజూ వెల్లుల్లి తినడం మంచిది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

 వెల్లుల్లిలో సల్ఫర్ తో కూడిన  రసాయనాలు,  యాంటీఆక్సిడెంట్లు  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.  ప్రతిరోజూ వెల్లుల్లి తినడం ద్వారా  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.  వైరల్ ఇన్పెక్షన్లను  సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వెల్లుల్లిని వివిధ రకాలుగా తినవచ్చు.  పచ్చి వెల్లుల్లినే తినాల్సిన అవసరం లేదు.

శరీరాన్ని శుద్ది చేస్తుంది

 ఆరోగ్యకరమైన జీవక్రియ వెల్లుల్లి తినడం  ద్వారా సాధ్యమవుతుంది. ఇది శరీరాన్ని శుద్ది చేయడంలో  సహాయపడుతుంది.  తద్వారా  బరువు తగ్గడాన్ని  ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజూ వెల్లుల్లి తినడం, ముఖ్యంగా చలికాలంలో తినడం వల్ల సహజంగా  బరువు-నియంత్రణ సాధ్యమవుతుంది. పచ్చి వెల్లుల్లి రసాన్ని,  తేనెను ఉదయాన్నే తీసుకోవడం వల్ల నిస్సందేహంగా బరువు తగ్గుదలలో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి.


శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

 వెల్లుల్లిలో ఉండే  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యం,  శ్వాసక్రియకు తోడ్పడతాయి.  ఇవి తరచుగా చల్లని వాతావరణంలో వచ్చే  జ్వరం, శ్వాసనాళాలు, ముక్కుల రద్దీ,  గొంతు నొప్పి ద్వారా కలిగే సమస్యలు. వీటికి వెల్లుల్లి చెక్ పెడుతుంది.

 జీర్ణక్రియ మెరుగుపరుస్తంది

  ఆహారం మెరుగ్గా  జీర్ణం కావడానికి,  పోషకాలను గ్రహించడానికి,  జీర్ణ రసాలు,  ఎంజైమ్‌ల సంశ్లేషణ చాలా అవసరం. ఈ సంశ్లేషణ పెంచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.  శరీరం ఆహారం నుండి తగినంత పోషకాలను స్వీకరించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

                                       *నిశ్శబ్ద.

 



Source link

Leave a Comment