ముల్లంగి చాలా పవర్ఫుల్ కానీ.. 90శాతం మంది తప్పు పద్దతిలో తింటున్నారట..!


posted on Dec 14, 2024 9:29AM


ముల్లంగి చాలా ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి.  నీటి శాతం అధికంగా ఉండే ఈ కూరగాయ తినడం వల్ల బోలెడు ఆరోగ్య సమస్యలు మంత్రించినట్టు మాయమవుతాయి. శీతాకాలపు రోజుల్లో ముల్లంగి కూరగాయలు సమృద్ధిగా పండుతాయి.  వీటిని ఎక్కువగా తినే కాలం కూడా శీతాకాలమే..   చాలామంది ముల్లంగి వాసనను ఇష్టపడరు. కానీ ఇతర రాష్టాలలో ముల్లంగిని కీర దోస లాగా చక్రాలుగా కట్ చేసుకుని తింటారు. కానీ చాలామందికి ముల్లంగిని ఎలా తినాలో క్లియర్ గా తెలియదట. ముల్లంగిలో పోషకాల గురించి, దాన్ని ఎలా తినాలనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే..


ముల్లంగిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది.  పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు ముల్లంగిలో 17.2 గ్రాముల విటమిన్ సి ఉంటుంది.  ముల్లంగిలో  కాల్షియం, విటమిన్ బి6, ఫోలేట్, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ముల్లంగి ఆకుల్లో దుంపల కంటే రెట్టింపు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాన్సర్‌ను నివారించడంలో, బరువును నియంత్రించడంలో, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. ముల్లంగిని సరైన పద్ధతిలో తీసుకుంటేనే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

సలాడ్..

ముల్లంగిని, వీటి ఆకులను సన్నని ముక్కలుగా కట్ చేసి వాటిని సలాడ్‌లో జోడించాలి. ఆకుపచ్చ కూరగాయలు, దోసకాయ, క్యారెట్లతో కలిపి సలాడ్ తయారు చేసుకోవాలి. ముల్లంగి ముక్కలను హుమ్ముస్ లేదా పెరుగుతో తినవచ్చు. సూప్‌లు, టాకోస్ లేదా అన్నంతో కలిపి తీసుకోవచ్చు.


ఆకులు..

ముల్లంగి మాత్రమే కాదు.. ఆకులు కూడా ఆరోగ్యమే..  వీటిలో పోషకాలు కూడా  అధికం. ముల్లంగి కంటే ముల్లంగి ఆకులలో ఎక్కువ కాల్షియం,  విటమిన్ సి ఉంటాయి. స్మూతీస్‌లో ముల్లంగి ఆకులను జోడించడం ద్వారా పోషకాహాలను  పెంచుకోవచ్చు. వెల్లుల్లి, ఆలివ్ నూనె,  చిటికెడు ఉప్పుతో వేయించిన  ముల్లంగి ఆకులను తిసుకోవచ్చు. తరిగిన ముల్లంగి ఆకులను సూప్‌లు,  వంటలలో జోడించవచ్చు.

ఊరగాయ..

ముల్లంగితో ఊరగాయ అనగానే చాలామంది షాకవుతారేమో.. కానీ ఇలా ముల్లంగిని ఊరబెట్టడం ద్వారా దానిలో ప్రోబయోటిక్ కంటెంట్ పెరుగుతుంది. ఇది గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  ముల్లంగి ఊరగాయ కోసం ముల్లంగి ముక్కలను ఉప్పు నీటిలో పులియబెట్టాలి.  దీనిని శాండ్విచ్ లేదా సైడ్ డిష్ గా తినవచ్చు.  ఇంకా ముల్లంగితో కిమ్చిని కూడా తయారు చేయవచ్చు.  చైనా, జపాన్ లలో వీటిని ఎక్కువగా తింటారు.


ఆరోగ్యకరమైన కొవ్వులతో..


ముల్లంగిలో కొవ్వులో కరిగే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులతో బాగా శోషించబడతాయి. సలాడ్ లేదా టోస్ట్ చేసేటప్పుడు  అవోకాడోతో ముల్లంగిని జోడించవచ్చు. కాల్చిన గింజలు లేదా విత్తనాలతో ముల్లంగి సలాడ్ తీసుకోవ్చచు. ముల్లంగి ముక్కల్లో ఆలివ్ ఆయిల్, ఉప్పు వేసి తినవచ్చు.

స్మూతీ..

ముల్లంగి రసం కాలేయాన్ని శుధ్ది చేయడంలో సహాయపడుతుంది.  జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ముల్లంగి, యాపిల్, క్యారెట్,  అల్లం కలిపి తాజా జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. ముల్లంగి, దోసకాయ, నిమ్మ,  బచ్చలికూరతో డిటాక్స్ స్మూతీని కూడా తయారు చేసి త్రాగవచ్చు.

                                     *రూపశ్రీ.

 



Source link

Leave a Comment