EntertainmentLatest News

A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ కి థాంక్స్ చెప్పిన EVOL మూవీ దర్శక, నిర్మాత రామ్ యోగి వెలగపూడి!


ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL. ‘LOVE’ ని రివర్స్ లో చూస్తే ‘EVOL’ అని ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని వెల్లడించారు ప్రొడ్యూసర్ – డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి. రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది.

ఎవోల్  EVOL. (a love story in reverse ) డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను శుక్రవారం ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో దర్శక నిర్మాత రామ్‌ యోగి వెలగపూడి పాల్గొని మాట్లాడుతూ.. తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్‌ ల్యాబ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్‌, నేపథ్యంలో సాగే కథ అని, డిఫరెంట్‌  అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిందని, ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుందని తెలిపారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌, వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని అన్నారు.

సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా, విజయ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.



Source link

Related posts

TFI will show the show to Jagan జగన్ కి షో చూపించనున్న TFI

Oknews

Telangana CM Revanth Reddy Responds Over Rahul Gandhi Stopped From Visiting Assam Shrine | Revanth Reddy: రాహుల్ గాంధీపై ఎవరి కుట్రలూ ఫలించవు, అది బీజేపీ స్పాన్సర్డ్ దాడి

Oknews

జయసుధ ఫోన్ లాగేసిన మోహన్ బాబు!

Oknews

Leave a Comment