ByGanesh
Tue 23rd Apr 2024 11:25 AM
క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. గత ఏడాది వరసగా యంగ్ హీరోల సినిమాలు ఆమెని నిరాశ పరచడంతో డల్ అయిన శ్రీలీల ఇప్పుడు ఏరికోరి సినిమాలు ఎంచుకొవాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మెచ్యూరిటీ లేకుండా కథల ఎంపికలో శ్రీలీల చేసిన పొరబాటు మరోసారి రిపీట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అప్పుడే సినిమాలు సైన్ చెయ్యాలని అనుకుంటుందట.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అటు VD 12 ప్రాజెక్ట్ ఆమె చేజారిపడంతో శ్రీలీల ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే శ్రీలీలకి తమిళనాట బంపర్ ఆఫర్ తగిలింది అంటున్నారు. అది కూడా స్టార్ హీరో అజిత్ సరసన శ్రీలీల కి అదిరిపోయే అవకాశం వచ్చిందట.
మార్క్ ఆంటోనీ మూవీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటించబోయే చిత్రంలో శ్రీలీలని హీరోయిన్ గా ఎంపిక చెయ్యడమే కాకుండా ఆమెని సంప్రదించగా.. కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట శ్రీలీల. మరి ఈ ప్రాజెక్ట్ అధికారికంగా తెలిసే వరకు ఆమె అభిమానులకు కాస్త ఆందోళనగానే ఉంటుంది. కారణం ఆమె నుంచి వరసగా డిస్పాయింట్ మూవీస్ రావడంతో ఫాన్స్ కూడా పాపం ఢీలా పడిపోయి ఉన్నారు.
A bumper offer for Sreeleela..:
Sreeleela in talks to star as heroine in Good Bad Ugly