Latest NewsTelangana

a man died due to egg bajji stucked in his throat in vanaparthi district | Vanaparthi News; ఊపిరి తీసిన ఎగ్ బజ్జీ


Man Died Due To Egg Bajji Stucked In His Throat in Vanaparthi: మృత్యువు ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో కబళిస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకూ మనతో ఉన్న వారే అనుకోని సంఘటనలతో ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా, ఓ వ్యక్తి తనకు ఇష్టమైన కోడిగుడ్డు బజ్జీ తింటుండగా.. అది గొంతులో ఇరుక్కుని అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటన వనపర్తిలో (Vanaparthy) విషాదం నింపింది. మదనాపురం మండలం గోవిందహళ్లికి చెందిన గొల్ల తిరుపతయ్యకు బజ్జీలు అంటే చాలా ఇష్టం. గురువారం సాయంత్రం ఇంటి బయట కూర్చుని కోడిగుడ్డు బజ్జీ (Egg Bajji) తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక అస్వస్థతకు గురై కింద పడిపోయాడు. భర్తను గమనించిన భార్య కోడిగుడ్డును తీసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఇరుగు పొరుగు వారు వచ్చి అతని గొంతులో ఇరుక్కున్న బజ్జీని బయటకు తీశారు. అయితే, అప్పటికే తిరుపతయ్య ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. కళ్లెదుటే భర్త మరణాన్ని చూసిన భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. అప్పటి వరకూ తమతో ఉన్న వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Also Read: Dharani Special Drive: ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ షురూ – అధికారులకు ప్రత్యేక అధికారాలు

మరిన్ని చూడండి



Source link

Related posts

Patnam Mahender Reddy Couple join Congress Party In Shortly Chevella MP Ticket for Sunitha Reddy has been Finalized

Oknews

Ayodhya Bandi Sanjay: రాం లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన బండి సంజయ్

Oknews

Vijaya Kranthi: తెలంగాణలో మరో తెలుగు దినపత్రిక… విజయక్రాంతి పత్రిక ప్రారంభం, ప్రముఖుల అభినందనలు

Oknews

Leave a Comment