ByGanesh
Wed 11th Oct 2023 01:56 PM
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఐరా పెళ్లి తేదీపై అందరిలో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది. జిమ్ ట్రైనర్ నుపుర్ శిఖరే ని ప్రేమించి నిశ్చితార్ధం చేసుకున్న ఐరా ఖాన్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అమీర్ ఖాన్ కూడా లాల్ సింగ్ చద్దా సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని ఈమధ్యనే కొత్త సినిమాని ప్రకటించాడు.
అయితే అమీర్ పబ్లిక్ లోకి ఎప్పుడొచ్చినా ఆయన కుమార్తె పెళ్లి తేదీ గురించే అందరూ మాట్లాడుతున్నారు, ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా అమీర్ ఖాన్ తన కుమార్తె ఐరా పెళ్లి తేదీని రివీల్ చేసారు. జనవరి 3 2024 న ఐరా ఖాన్-నుపుర్ శిఖరే ల వివాహం జరగనున్నట్లుగా ఆయన చెప్పారు. ఐర మానసికంగా కుంగిపోయిన సమయంలో నుపుర్ ఆమెకి అండగా నిలిచాడంటూ అమీర్ చెప్పుకొచ్చారు.
ఇక నుపుర్ ఇప్పటికే మా ఫ్యామిలీతో కలిసిపోయాడని చెప్పిన అమీర్ ఖాన్ తన కుమార్తెని నుపుర్ చక్కగా చూసుకుంటాడు. వాళ్ళు ఇరువురు ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నారు అంటూ అమీర్ ఖాన్.. తన కుమార్తె ఐరా పెళ్లి రోజున తాను ఎమోషనల్ అవుతాను అంటూ చెప్పుకొచ్చారు.
Aamir Khan daughter wedding date is fixed:
Aamir Khan daughter Ira Khan wedding date locked