ByGanesh
Sat 02nd Mar 2024 11:52 AM
మంజులనాయుడు తెరకెక్కించిన చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ ఇప్పటికి బుల్లితెర మీద కనిపిస్తే ఆటోమాటిక్ గా ప్రేక్షకులు నిలుచుండిపోతారు. బుల్లితెర మీద పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సీరియల్స్ గా చక్రవాకం, మొగలి రేకుల్లో నటించిన నటులు ఇప్పటికీ పలు సీరియల్స్ లో కనిపిస్తున్నారు. మొగలి రేకులులో ధర్మ, సత్య, దయ త్రయం ఎక్కడ కనిపించినా వారి అసలు పేర్ల కన్నా సీరియల్ పేర్లతోనే వారిని పిలుస్తూ ఉంటారు.
ధర్మ ఇంద్ర నీల్ వర్మ, మిగతా ఇద్దరూ మొగలి రేకులు సీరియల్ పేర్లతోనే ఫేమస్ అయ్యారు. అయితే మొగలి రేకులు సీరియల్ లో దయగా కనిపించిన నటుడు పవిత్రనాథ్ మృత్యువడిలోకి జారిపోయాడు. చాలా చిన్న వయసులోనే దయ ఉరఫ్ పవిత్రనాథ్ మరణించడం పట్ల కుటుంభ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పవిత్రనాథ్ మృతి చెందిన విషయాన్ని ఇంద్రనీల్ ఆయన భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఆమె ఇన్స్టాలో ఇలా రాసుకొచ్చింది. పవి నీ బాధని మేము వర్ణించలేకపోతున్నాము, నీవు మా ఫ్యామిలిలో ఎంతో ముఖ్యమైనవాడివి. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయవనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. నీ మరణవార్త అబద్దమైతే బావుండు అనిపిస్తుంది. కనీసం నీకు కడసారి వీడ్కోలు చెప్పలేకపోయాము, నీ ఆఖరి చూపుకి కూడా నోచుకోలేకపోయాము. నీ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్దిస్తున్నామంటూ మేఘన పోస్ట్ చేసారు. అయితే పవిత్రనాథ్ మరణానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Actor Pavitranath Passed Away:
Mogalirekulu Serial Actor Pavitranath Passed Away