ByGanesh
Fri 01st Mar 2024 06:56 PM
ఇండియాస్ రిచ్చెస్ట్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే మాములుగా ఉండదండోయ్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అంబానీ ఇంట పెళ్లి వేడుకల ముచ్చట్లే. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రీ వెడ్డింగ్ పార్టీ, ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అబ్బో ఒక్కటా రెండా.. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సులైతే ఎన్ని ముఖేష్ ఇంటికి అడుగుపెట్టాయో లెక్క కట్టడం కూడా కష్టమే. ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి సౌత్ సెలబ్రిటీస్ వరకు ముఖేష్ ఇంట పెళ్లి వేడుకల కోసం క్యూ కట్టారు.
పెళ్ళికి ముందే గుజరాతీ సంప్రదాయంలో ప్రత్యేక వంటకాలు సిద్దం చేసి అంబానీ కుటుంబమే స్వయంగా గ్రామస్తులకు వడ్డించింది. మరి ఇంత గ్రాండ్ వెడ్డింగ్ కోసం అంబానీ ఖర్చు ఎంత పెడుతున్నారో అనే ఆలోచనలో నెటిజెన్స్ కొట్టేసుకుంటున్నారు. అనంత్ అంబానీ పెళ్లి కోసం ఎన్నికోట్లు ఖర్చు చేస్తున్నారు అనే ఆరాలు మొదలైనాయి. అంబానీ ఇంట అంగరంగ వైభవంగా జరగబోతున్న పెళ్లి కోసం ఎన్నికోట్లు కేటాయిస్తున్నారంటే అక్షరాలా 1000 కోట్లు అని తెలుస్తోంది. కేవలం ప్రీ వెడ్డింగ్ నే ఈ రేంజ్ లో అందరూ చెప్పుకునే మాదిరి ప్లాన్ చేసారంటే.. అసలు పెళ్లిని ఇంకే రేంజ్ లో ప్లాన్ చేసి ఉండొచ్చో అనే ఊహాగానాల్లో జనాలు కనబడుతున్నారు.
మూడు రోజులు ప్రీ వెడ్డింగ్ వేడుక -పెళ్లికి కేటాయించిన బడ్జెట్ 1000 కోట్లు అని తెలుస్తోంది. పెళ్లి రోజున అనంత్ అంబానీ బంగారం తో తయారు చేయించిన దుస్తుల్ని ధరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ గురించే సోషల్ మీడియాలో ఇంత చర్చ కనిపిస్తుంది అంటే.. పెళ్లి సమయానికి ఇంకెంత మాట్లాడుకుంటారో.. ఈ పెళ్లి గురించి కొన్ని రోజుల తరబడి సోషల్ మీడియాలో చర్చలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్-ఉపాసన దంపతులకి అంబానీ ఇంట పెళ్లి వేడుకకి ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది.
Anant Ambani and Radhika Merchant Wedding Celebrations :
Anant Ambani-Radhika Merchant pre-wedding celebrations