ముఖ్య వివరాలు :
- రీవెరిఫికేషన్ కోరే విద్యార్థులు – 1300 చెల్లించాలి
- రీ కౌంటింగ్ కోరే విద్యార్థులు – 260 చెల్లించాలి.
- ఇంప్రూమెంట్ పరీక్షలు రాసే ఆర్ట్స్ విద్యార్థులు – 1240 చెల్లించాలి. సైన్స్ విద్యార్థులు 1440 కట్టాలి.
- సప్లిమెంటరీ పరీక్షలు రాసే ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు రూ. 1100 చెల్లించాలి. ప్రాక్టికల్స్ ఫీజు రూ. 500గా ఉంది.
ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల(AP Intermediate Results 2024) అయ్యాయి. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉతీర్ణత, సెకండియర్ లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 81 గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా 79 శాతం మూడో స్థానంలో ఉంది. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా మొదటి స్థానంలో ఉండగా, గుంటూరు 87 , ఎన్టీఆర్ 87 రెండో స్థానంలో ఉన్నాయి. 84 శాతంతో విశాఖ మూడో స్థానంలో ఉంది. ఇంటర్ ఫస్టియర్ లో అల్లూరు జిల్లా 48 శాతంలో చివరి స్థానంలో ఉండగా, సెకండియర్ 63 శాతం చిత్తూరు చివరిస్థానంలో ఉన్నాయి. ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఈ ఏడాదీ బాలికలదే పై చేయి అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు. ఇంటర్ పాస్ పర్సంటేజ్‌లో బాలికలే పైచేయి సాధించారన్నారు.