ByGanesh
Wed 06th Mar 2024 03:53 PM
బాబోయ్.. ఎంపీ టికెటా?
ఏపీలోని అన్ని పార్టీల్లోనూ ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. అదేంటంటే.. ఎంపీ అభ్యర్థుల కొరత. రండి బాబూ రండి.. ఎంపీ సీట్లు ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదట. అసెంబ్లీకి పోటీ చేసేందుకే నేతలంతా ఆసక్తి కనబరుస్తున్నారట. నిజానికి ఎంపీ పదవి గొప్పదే కానీ ఇప్పుడు మాత్రం అంత గొప్పగా లేదట. అసలు ఎంపీగా పోటీ చేసేందుకు నేతలు ఎందుకు ఆసక్తికనబరచడం లేదంటే.. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ఎంపీ అంటేనే ఒక డిమోషన్‌గా నేతలంతా భావిస్తున్నారట. గతంలో ఎంపీల చేతిలో చాలా అధికారాలు ఉండేవి. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ లాగేసి.. ఎంపీలను డమ్మీలుగా మార్చేసిందని టాక్.
మంత్రి పదవి దక్కిందో బిందాస్..
ఎంపీలకు పవర్స్ నిల్. వెళ్లి పార్లమెంటులో కాసేపు కూర్చోవాలి. ఏమైనా అడిగేదుంటే అడగాలి.. వచ్చేసేయాలి. ఇక అంతే. దీనికి మించి పవర్స్ లేవు. ఎలాంటి ప్రయోజనాలు పొందనివ్వకుండా మోదీ ప్రభుత్వం కట్టడి చేసిందట. ఈ మాత్రం చోద్యానికి ఎంపీగా పోటీ చేసి కోట్ల రూపాయలు తగలేయడం ఎందుకని అభ్యర్థులు వెనుకాడుతున్నారట. అదే ఏపీలో ఏ ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా నియోజకవర్గంలో తానే కింగ్. అదృష్టం బాగుండి మంత్రి పదవి దక్కిందో ఇక బిందాజ్. అలాంటి లైఫ్‌ని వదిలేసుకుని డమ్మీగా ఉండాలని ఎవరు అనుకుంటారు. పైగా ఎమ్మెల్యే అభ్యర్థితో పోలిస్తే ఎంపీ అభ్యర్థి ఎన్నికల కోసం చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుందని ఎంపీ సీటంటేనే వెనుకాడుతున్నారట.
జంపింగ్స్ అయితే లేవు కానీ..
ఈ పరిస్థితి ఒక్క అధికార పక్షానికే పరిమితం కాదు.. విపక్షాలది కూడా సేమ్ సిట్యువేషన్. ఇక అధికారపక్షంలో అయితే టికెట్ ఇస్తామన్న కూడా ఎంపీలు జంప్. లావు శ్రీకృష్ణదేవరాయలు మొదలు.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులంతా టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇక మంత్రి గుమ్మనూరు జయరాంకి ఈసారి కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తామని వైసీపీ ప్రకటించింది. నిజానికి అది గెలిచే స్థానమే అయినప్పటికీ కూడా వైసీపీకి అభ్యర్థులు దొరకడం లేదు. టీడీపీలోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. పెద్దగా జంపింగ్స్ అయితే లేవు కానీ ఎంపీ సీటుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో పార్టీల అధిష్టానాలు ఎంపీల విషయంలో సిట్టింగ్‌లను మార్చేందుకు కూడా సాహసం చేయడం లేదట.
Are you so excited to compete as an MP!:
It is said that MPs have been turned into dummies