GossipsLatest News

Bad ratings for RP fish pulusu RP చేపల పులుసుకి దారుణమైన రేటింగ్స్


TV షోస్ ని, సినిమా అవకాశాలని పక్కనపెట్టిసి పూర్తిగా నెలూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ కి అంకితమైన కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పలు బ్రాంచ్ ల ఓపెనింగ్స్ తో బిజీగా వున్నాడు. అయితే ఆర్పీ చేపల పులుసు ఫేమస్ అవ్వడానికి ప్రధాన కారణం యూట్యూబ్ ఛానల్స్. ఆర్పీ ని ఇంటర్వూస్ తీసుకుంటూ అతని చేపల పులుసుని ఛానల్స్ పాపులర్ చేసాయి. నెల్లూరు నుంచి చేపలు తెప్పించి ఫ్రెష్ గా వండి అందరికి అందిస్తున్నామని చెప్పే ఆర్పీ.. తన చేపల పులుసు రేట్లు ఎక్కువ పెట్టేసాడు.

నావన్నీ ఫ్రెష్, మామిడికాయలు, చింతపండు, చేపల పులుసు కోసం వాడే మసాలా మేము స్వయంగా తయారు చేస్తాము, కట్టెల పొయ్యి మీద పులుసు వండటం, మెయిన్ గా చెప్పాలంటే నెల్లూరు నుంచే చేపలు తెప్పిస్తాం, కాబట్టే నా చేపల పులుసుకి రేటెక్కువ అని చెప్పేవాడు. అతని దగ్గర కేజీ కోరమీను పులుసు అక్షరాలా 1800. అదేమిటి అంటే.. అవును కోరమీను రేటెక్కువ, అది రెండు కేజీలు తీసుకుంటే కేజీ ముక్కలు వస్తాయి. తలా, తోకతీసేసి పులుసు పెడతాం అందుకే నా రేటు ఇది అని చెబుతాడు.

అయితే ఒకప్పుడు ఆర్పీ చేపల పులుసుని పొగిడినవారు ఇప్పుడు తిడుతున్నారు. ఆర్పీ చేపల పులుసు కోసం స్విగ్గి, జొమాటో లలో ఆర్డర్స్ పెట్టేవారు.. కింద కామెంట్స్ రూపంలో ఆర్పీ చేపల పులుసు చెత్త అంటూ కామెంట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఫ్రెష్ కాదు, అతని చేపల పులుసులో టేస్ట్ లేదు, క్వాలిటీ లేదు, రేటుకి తగ్గ క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ విషయంలో నిరుత్సాహ పరిచారు అంటూ నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసుకి దారుణమైన కామెంట్స్ దారుణమైన రేటింగ్స్ ఇస్తున్నారు.

మరి ఇది ఆర్పీ కి షాకిచ్చే విషయమే. ఇప్పటివరకు నా చేపల పులుసు గొప్ప అని చెప్పుకున్నోడు ఇప్పుడు ఏం మాట్లాడతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. 





Source link

Related posts

YS Sharmila Invitation To Pawan Kalyan పవన్ కళ్యాణ్ ను కలిసిన YS షర్మిల

Oknews

ఎమోషనల్‌ అయిన విజయ్‌ దేవరకొండ.. తన లవ్‌ సక్సెస్‌ అయిందట!

Oknews

Anasuya latest look viral అమ్మో అనసూయ ఎక్కడా తగ్గట్లేదుగా..

Oknews

Leave a Comment