BCCI Secy Jay Shah Prediction: బార్బడోస్‌లో మరికాసేపట్లో మహా సమరం జరగనుంది. ఈ సమరంలో గెలిచిన జట్టు జగజ్జేతగా నిలవనుంది. టీమిండియా-సౌతాఫ్రికా(IND Vs SA) మధ్య జరగనున్న టీ 20 ప్రపంచ కప్(T20 World Cup) ఫైనల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపైనే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎవరి బలాలేంటీ..? బలహీనతలెంటీ..। చెలరేగి ఆడేదవరు ఇలా ఎవరి లెక్కలు వారేసుకుని విజేతలుగా నిలిచేది ఎవరో అంచనా వేస్తున్నారు. అయితే వీళ్లందరి కంటే ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా ఈసారి టీ 20 ప్రపంచకప్ విజేత ఎవరో ముందే చెప్పేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
I hope everything should go according to script 🤞😌
– ( Jay shah)#INDvsSAFinal #INDvSA pic.twitter.com/vkvbiMsaIN
— INNOCENT 🤠 (@iM_innocennt) June 29, 2024
ఎప్పుడన్నారు.. ఏమన్నారు
బార్బడోస్‌లో టీమిండియా జెండా పాతుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా ముందే ఊహించారు. చాలా నెలల క్రితమే జై షా ఈ జోస్యం చెప్పారు. అహ్మదాబాద్‌లో 2023 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి ఎదురై అప్పుడే ఏడు నెలలు గడిచిపోయింది. ఆ సమయంలోనే జై షా కీలక ప్రకటన చేశారు. వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓడిపోయినా.. టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని జై షా జోస్యం చెప్పారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమితో తీవ్ర భావోద్వేగానికి గురైన జైషా… అప్పట్లోనే ఈ ప్రకటన చేశారు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ విజయం సాధిస్తుందని అంచనా వేశారు. తాను ప్రపంచకప్ ఓటమిపై ఇప్పుడు ప్రకటన ఇస్తున్నానని… 2023లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత కూడా టీమిండియా ట్రోఫీని ఎత్తలేకపోవచ్చని… ఇప్పుడు తాము హృదయాలను గెలిచామని 2023 ఫైనల్లో ఓటమి అనంతరం జై షా అన్నాడు. ఈ ఓటమితో ఆగిపోమని… 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో బార్బడోస్‌లో కచ్చితంగా భారత జెండా పాతుతామని అప్పుడే జై షా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ మాటలు నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జై షా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈసారి ఎన్ని అవంతరాలు ఎదురైనా టీమిండియానో విజయం సాధిస్తుందని… అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
WE ARE ONE 🇮🇳
Wishing #TeamIndia all the very best for the ICC Men’s T20 World Cup 2024 Final against South Africa! 🇮🇳🏏 Show your strength, skill, and spirit on the field and bring home the trophy! 🏆💪 #INDvSA #T20WorldCup2024 @BCCI pic.twitter.com/KMz2Tuq3ut
— Jay Shah (@JayShah) June 29, 2024
అజేయంగా భారత్…
2023 వన్డే ప్రపంచకప్‌లాగానే 2024 టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో టీమ్ ఇండియా 9 మ్యాచ్‌ల్లో గెలిచి, సెమీ-ఫైనల్‌లోనూ విజయం సాధించింది. కానీ అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో రోహిత్ సేన ఆస్ట్రేలియా ముందు తలవంచింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే పరిస్థితిలో ఉంది. కానీ ప్రత్యర్థి మారింది. దక్షిణాఫ్రికా.. భారత్‌కు.. ప్రపంచకప్‌నకు మధ్య ఉంది. ప్రొటీస్‌ను ధాటి టీమిండియా కప్పును గెలుచుకునేందుకు సిద్ధంగా ఉంది.
మరిన్ని చూడండి