Entertainment

Bigg Boss: బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సింగర్ మంగ్లీ…


Bigg Boss: బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సింగర్ మంగ్లీ...

తెలుగు బిగ్ బాస్ సీజన్-4 కు మొదట్లో మంచి రేటింగ్ వచ్చింది. అయితే షో లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన దేవి నాగవల్లి ఎలిమినేషన్ అన్ ఫెయిర్ గా అనిపించిందంటూ బిగ్ బాస్ ప్రియులు మండిపడ్డారు. మెహబూబ్ ను సేవ్ చేయడానికి ఫేక్ ఎలిమినేషన్ చేసారంటూ కామెంట్లు చేశారు. ఇక ఆ తరవాత కుమార్ సాయి విషయంలోనూ అలాగే జరిగింది. కుమార్ సాయి జెన్యూన్ కంటెస్టెంట్ అని అతనికి సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ పెరిగింది. ఆ వారం మోనాల్ లేదా దివి ఎలిమినేషన్ పక్కా అని ప్రేక్షకులు భావించారు. అంతేకాకుండా అనఫీషియల్ ఓటింగ్ సైట్స్ లో కుమార్ సాయి ఓటింగ్ టాప్ లో ఉంటే మోనాల్, దివి మోనాల్ వోటింగ్ కింద నుండి టాప్ లో కనిపించింది. దాంతో కుమార్ సాయి హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడంతో బిగ్ బాస్ ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు.

తరవాత రోజు నుండి బిగ్ బాస్ చూడమని తాము ఓట్లు వేసి కూడా దండగే అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎలిమినేషన్ టైం లో కుమార్ సాయి పై అఖిల్ చూపించిన అటిట్యూడ్ కు నాగార్జున స్పందించకపోవడం పై కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. దాంతో బిగ్ బాస్ రేటింగ్ అమాంతం పడిపోయింది. ఇక తాజాగా షో రేటింగ్ పెంచేందుకు నిర్వాహకులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సింగర్ మంగ్లీ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఆమెకు భారీ పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
 

 



Source link

Related posts

‘జవాన్‌’ డైరెక్టర్‌ అట్లీపై నయనతార సంచలన వ్యాఖ్యలు!

Oknews

సుజీత్ దర్శకత్వంలో నాని.. పవన్ కళ్యాణ్ 'ఓజీ' పరిస్థితి ఏంటి?

Oknews

‘కల్కి 2898 AD’ ఫస్ట్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Oknews

Leave a Comment