ByGanesh
Sun 15th Oct 2023 10:10 PM
బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికి 6 వారాలు పూర్తి చేసుకుంది. నాగార్జున హోస్ట్ గా ఉల్టా ఫుల్టా అంటూ బిగ్ బాస్ టీఆర్పీ పెంచేందుకు యాజమాన్యం కిందా మీదా పడుతుంది. అందులో భాగమే నెల తర్వాత కొత్తగా ఐదుగురిని హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించడం, మూడు వారాలుగా ఎలిమినేట్ అయిన దామిని-రతిక-శుభశ్రీలలో ఈరోజు ఆదివారం ఒకరిని రీ ఎంట్రీ ఇప్పించడం వంటి అంశాలతో కొత్తగా అంటూ ఏదో చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఐదు వారాలకు గాను ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు.
ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అంటూ గత మూడు రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ చివరి ముగ్గురులో పూజ సేవ్ అవ్వగా ఫైనల్ గా అశ్విని-నయని పావని మధ్యలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి క్రియేట్ చేసారు. మరి ఈ ఆరో వారం ఎవరు ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారంటే.. క్యూట్ అండ్ ఎనెర్జటిక్ భామ నయని పావని హౌస్ లోకి ఎంటర్ అయిన వారంలోనే ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడాల్సి వచ్చింది.
మరి గ్లామర్ కి గ్లామర్, అందానికి అందం, చాలా అంటే చాలా యాక్టీవ్ గా టాస్క్ లు ఆడడడం, తెలివిగా ఆలోచించడం ఇవన్నీ నయని సొంతం. హౌస్ లో చక్కగా చలాకీగా తిరిగే నయని పావని ఎలిమినేషన్ పై అందరిలో అసంతృప్తి. కానీ నయని ఈ వారం ఎలిమినేట్ అయ్యి నాగార్జున తో పక్కనే నిల్చుంది. నయని పావని ఎలిమినేషన్ మాత్రం హౌస్ లోని వారికే కాదు, నెటిజెన్స్ కి కూడా బాగా షాకిచ్చింది.
నయని పావని కూడా ఎలిమినేట్ అవ్వకముందు కాన్ఫిడెంట్ గా కనిపించింది. తనెలాగూ హౌస్ లో ఉంటాను అనుకుంది. కానీ నాగార్జున ఎలిమినేట్ అనగానే వెక్కి వెక్కి ఏడ్చింది. హౌస్ మేట్స్ ఎంత ఓదార్చినా ఆమె ఏడుపు ఆపుకోలేకపాయిన ఈ ఎపిసోడ్ చాలామంది గుండెని భారం చేసింది.
Bigg Boss 7 Telugu, Nayani Pavani Evicted:
Bigg Boss 7: No Luck For Women as Nag Evicts Another Female Contestant