ByGanesh
Sat 07th Oct 2023 04:06 PM
శనివారం వస్తుంది అంటే చాలు బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ హోస్ట్ నాగార్జున ఎవరిని పొగుడుతారో.. ఎవరిని కోప్పడతారో తెలియక అయోమయంలో కనిపిస్తారు. గత వారం సందీప్ మాస్టర్ సంచాలక్ గా ఫెయిల్ అంటూ మొహం మీదే తిట్టేసిన నాగార్జున ఈ వారం టేస్టీ తేజాని-ప్రిన్స్ యావర్ ని మాత్రం మెచ్చుకున్నారు. తేజ ఎంటర్టైన్ చేస్తాను అని మాటిచ్చావ్.. అలాగే నవ్వించావ్ అన్నారు.
ఇక అమరదీప్-సందీప్ జోడీపై నాగార్జున ఫైర్ అయ్యారు. అమరదీప్ టాస్క్ మధ్యలో మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని నాగార్జున క్లాస్ పీకారు. టాస్క్ పూర్తి కాకుండా బెల్ కొట్టావంటూ అమరదీప్ ని నాగార్జున అడిగారు.. దానికి అమరదీప్ బిక్కమొహం వేసాడు. మీ తెలివితేటలు పరాకాష్టకి చేరాయంటూ నాగార్జున కోపం ప్రదర్శించారు. అనుదీప్-శివాజిలు గొడవ పడిన వీడియో ప్లే చేసారు. తొక్కలో సంచాలక్ బొక్కలో జేడ్మెంట్ అంటూ నాగార్జున అమరదీప్ ని చెడామడా తిట్టేసారు.
తర్వాత ప్రియాంక-శోభా శేట్టిలని నించోబెట్టి క్లాస్ పీకారు. ఇంకా శివాజీ-పల్లవి ప్రశాంత్ జోడీని నిలబెట్టి ఏదో చెప్పబోయారు. ఇక ఈరోజు ప్రోమో ముగిసినా.. ఈ రోజు శనివారం ఎపిసోడ్ మాత్రం కాస్త హాట్ గా ఉండబోతుంది అనేది ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది.
Bigg Boss 7: Today promo highlights :
Bigg Boss 7: Nagarjuna class to contestants