ఇప్పటివరకు సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి అక్కడ జెండా పాతుదామనే హీరోయిన్స్ ని ఎక్కువగా చూస్తూ వస్తున్నాము. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ లో ఉంది. నార్త్ భామల జోరు సౌత్ లో మొదలయ్యింది. హిందీ నుంచి సౌత్ కి వచ్చే హీరోయిన్స్ ఎక్కువయ్యారు. ప్యాన్ ఇండియా ఫిలిమ్స్ అంటూ ఎల్లలు దాటిస్తున్నసౌత్ దర్శకులపై నార్త్ భామల కన్ను పడింది. అందుకే ఆఫర్ ఇస్తామనగానే రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. అందులో ముందుగా కియారా అద్వానీ ఉంది. నార్త్ లో అంతగా సక్సెస్ కాలేని కియారా తెలుగు స్టార్ హీరోల సరసన జోడి కట్టింది. ఇక్కడ హిట్ పక్కనబెడితే ఆ తర్వాత ఆమె జోరు బాలీవుడ్ లో మొదలయ్యింది.
దానితో తిరిగి సౌత్ లో కాలు పెట్టింది. రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ లాంటి ప్యాన్ ఇండియా ఫిలిం లో నటిస్తుంది. వార్ 2 లో హ్రితిక్ కి జోడి అంటున్నారు, రీసెంట్ గా రన్వీర్ సింగ్ మూవీ కి సైన్ చేసింది. ఇక హిందీలో హృతిక్ రోషన్ వంటి పెద్ద హీరోల సరసన నటించింది, అక్కడ ప్లాప్ హీరోయిన్ గా మిగిలిన మృణాల్ ఠాకూర్ సౌత్ మూవీస్లో వరస హిట్స్ కొడుతోంది. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో తన మార్క్ చూపించింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో రాబోతుంది.
ధఢక్ తో పాటు మిలి చిత్రాల్లో నటించి హిందీలో సక్సెస్ కోసం వెంపర్లాడి.. చివరికి సౌత్ సినిమాలే బెస్ట్ అనుకుంటూ టాలీవుడ్ లో వాలిన జాన్వీ కపూర్ ఒకేసారి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ తో జోడీ కడుతుంది. మరోపక్క బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కల్కి తో సౌత్ కి ఎంట్రీ ఇస్తుంది.
మరి సౌత్ భామలైన కాజల్, త్రిష, తమన్నా, రాశి ఖన్నా లాంటి వాళ్ళు అక్కడ హీరోయిన్స్ గా నిలదొక్కుకోవడానికి నానా రకాలుగా కష్టపడుతుంటే నార్త్ భామలకు మాత్రం టాలీవుడ్ పై పంజా విసురుతున్నారు.