ByGanesh
Fri 23rd Feb 2024 08:47 PM
గత కొన్నివారాలుగా ఆయమన్న సినిమా బాక్సాఫీసు దగ్గర సందడి చెయ్యడం లేదు. సంక్రాంతికి పెద్ద సినిమాలు గుంటూరు కారం, నా సామిరంగా, హనుమాన్ ల తర్వాత మధ్యలో రవితేజ ఈగల్ వచ్చినా అది ప్రేక్షకులని ఇంప్రెస్ చెయ్యడంలో విఫలమైంది. మధ్యలో కెప్టెన్ మిల్లర్, లాల్ సలామ్ లాంటి డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గరకి వచ్చినా ప్రేక్షకులు పటించుకోలేదు. గత వారం భైరవకోన తుస్సుమనిపించింది ఇక ఈ వారం ఐదారు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలకే టాక్ బావుంటే థియేటర్స్ కి వెళుతున్న రోజుల్లో చిన్న సినిమాలు ఎలాంటి ప్రమోషన్ లేకుండా సైలెంట్ గా వచ్చేసాయి.
వైవా హర్ష సుందరం మాస్టర్ టీమ్ కాస్త అటు ఇటుగా ఆడియన్స్ ముందు ప్రమోషన్స్ తో హడావిడి చేసింది, మిగతా సినిమాలు కనీసం ప్రేక్షకుల్లోకి కూడా వెళ్లనే లేదు. అసలు ప్రమోషన్లు జనాలకు అంతగా రీచ్ కాలేదు. అన్నీ చిన్న చిత్రాలే. అందులో మస్త్ షేడ్స్ ఉన్నాయ్, ముఖ చిత్రం, భ్రమయుగం డబ్బింగ్ చిత్రం, అర్జున్ రెడ్డి రేంజ్ లో హడావిడి చేసిన సిద్దార్థ్ రాయ్ లు ఉన్నాయి. ఇందులో ఒక్క సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రాలేదు, అసలు ఓపెనింగ్స్ కూడా లేవు అంటే నమ్ముతారా..
ఎంతో కొంత బజ్ ఉన్న సుందేరం మాస్టర్ పరిస్థితి అందుకు అతీతం కాదు. ఇక ఓపెనింగ్స్ ఇంత దారుణంగా ఉంటే.. ఈ వీకెండ్ లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరి ఈ వారం ప్రేక్షకులు లేక బాక్సాఫీసు బోసిపోతుంది. ఇంట్రెస్ట్ అయిన సినిమా లేక ఆడియన్స్ బోర్ ఫీలవుతున్నారు.
Box office is boring.:
List of Movies Releasing This Week