BRS Leader Bonthu Rammohan Meet CM Revanth: బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) భేటీ అయ్యారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయన.. ఇదే విషయమై రేవంత్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రామ్మోహన్ పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పై రామ్మోహన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. అనూహ్యంగా ఆ టికెట్ ను బండారు లక్ష్మారెడ్డికి కేటాయించడంతో అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం మరోసారి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తుండగా.. దానిపై కూడా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఆ తర్వాత జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ హస్తం పార్టీలో చేరారు. తాజాగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. త్వరలోనే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు మహేందర్ రెడ్డి సతీమణి తెలిపారు.
మరిన్ని చూడండి