Latest NewsTelangana

brs leaders to meet speaker on disqualification of khairatahabad mla danam nagendar | Danam Nagendar: దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ కు బీఆర్ఎస్ సిద్ధం


Brs Leaders Complaint Against Danam Nagendar To Speaker: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరనున్నారు. వాస్తవానికి ఆదివారం సాయంత్రమే స్పీకర్ ను కలవాలని వారు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. దానంపై అనర్హత పిటిషన్ సమర్పించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, బండారు లక్ష్మారెడ్డి తెలిపారు. నిర్ధేశిత సమయానికి హైదరాబాద్ హైదర్ గూడలోని స్పీకర్ నివాసానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని చెప్పారు. తాము ఎదురుచూస్తున్నామని.. పలుమార్లు ఫోన్ చేసినా స్పీకర్ స్పందించలేదని వాపోయారు. ముందు అపాయింట్ మెంట్ ఇచ్చి కలవకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్ ఒత్తిడితోనే తమను స్పీకర్ కలవలేదని ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మరోసారి స్పీకర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  సిద్ధమయ్యారు. 

బీఆర్ఎస్ కు వరుస షాక్ లు 

అటు, లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఆదివారం బీఆర్ఎస్ కీలక నేతలు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్జి (Ranjith Reddy), ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ.. వారికి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఆదివారం ఉదయమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇటీవలే దానం నాగేందర్ సీఎం రేవంత్ ను కలిశారు. పార్టీ మారేది లేదని చెబుతూనే.. హస్తం గూటికి చేరారు. దీంతో ఆయన వైఖరిపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనపై స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

Also Read: Mlc Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ – తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడి

మరిన్ని చూడండి



Source link

Related posts

సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై..!

Oknews

2029 belongs to YCP.. Why is Jagan so confident గజ గజ జగన్ కాదు.. జగ జగ జగన్!

Oknews

A bumper offer for Sreeleela.. శ్రీలీలకి బంపర్ ఆఫర్..

Oknews

Leave a Comment