అవకాశము వచ్చేనా……రెండు సంవత్సరాల క్రితం, సిద్దిపేట కలెక్టర్ గా పనిచేస్తూ స్వచ్చంద పదవీ విరమణ పొంది, బీఆర్ఎస్ పార్టీ లో చేరిన పి వెంకట్రామి రెడ్డి మాత్రం తనకు పార్టీ అభ్యర్థిగా తనకే అవకాశం లభిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికీ, ఎమ్మెల్సీ గా ఉన్న వెంకట్రామి రెడ్డి, పార్టీ అధినేత చంద్రశేఖర్ రావుకు చాల నమ్మకంగా పనిచేసిన అధికారుల్లో ఒకరు అనే పేరున్నది. ఐఏఎస్ ఆఫీసర్ గా, ఉమ్మడి మెదక్ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా , కొత్త జిల్లాలు ఏర్పడ్డంకా సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్ గా చాల కాలం పనిచేశారు. ఈ నేపథ్యంలో, తాను మెదక్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలువనున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో బాగా జరుగుతుంది. ఇంతకుముందు, ఎమ్మెల్సీగా పనిచేసి, TSPC మెంబెర్ గా కూడా పనిచేసిన, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ కూడా తాను పార్టీ టికెట్ కోరుకుంటున్నాను బాహాటంగా ప్రకటించడంతో, మెదక్ లోక్ సభ సీటు కోసం బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆసక్తికర పోటీ ఏర్పడింది.
Source link