Latest NewsTelangana

brs mla harish rao slams cm revanth reddy on farmers issue | Harish Rao: ‘రాజకీయ పార్టీల కోసం కాదు రైతుల కోసం గేట్లు తెరవాలి’


Brs Mla Harish Rao Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanthreddy) గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదని.. రైతుల కోసం తెరవాలని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి సీఎం వాళ్లింటికి వెళ్తున్నారని.. రైతులు చచ్చిపోతుంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లడం లేదని మండిపడ్డారు. జనగామ (Janagaon) జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతాబాయి తండాలో ఆదివారం పర్యటించిన బీఆర్ఎస్ నేతల బృందం ఎండిన పంటలను పరిశీలించింది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు పంటలు పరిశీలించి అన్నదాతల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో నీళ్లు రాక బోర్లకు నీళ్లు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు వారితో ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల్లో ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడలేదని.. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

‘పరిహారం చెల్లించాలని డిమాండ్’

రైతుల బాధలను చూస్తుంటే గుండె కదిలిపోతోందని హరీష్ రావు అన్నారు. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని.. ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేసి అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.25 వేలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, మంత్రులు హైదరాబాద్ లో రాజకీయాలు మానుకొని గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేదంటే ఛలో సచివాలయానికి పిలుపు నిస్తామని హెచ్చరించారు. 

‘రైతులను మోసం చేశారు’

గోదావరి నదిలో నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తేసిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ‘ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. రైతులను, రైతు కూలీలను, కౌలు రైతులను మోసం చేసింది. డిసెంబర్ 9న రూ.2 లక్షల మాఫీ చేస్తామని హామీ ఇచ్చి వంద రోజులు దాటినా నెరవేర్చలేదు. రైతుబంధు కింద రూ.15 వేలు ఇస్తామని మోసం చేశారు. గతంలో మేమిచ్చిన రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలువలకు పుష్కలంగా నీళ్లు వచ్చాయి. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేవు, కరెంటు లేదు. మోటార్లు కాలిపోతున్నయి. ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వడగండ్ల వానలో లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అయినా సీఎం రైతులను పరామర్శించిన పాపాన పోలేదు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే అన్నదాతలు ఆత్మస్థైర్యం కోల్పోతారు. కాంగ్రెస్ హామీ ప్రకారం వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనాలి. బోనస్ ఇవ్వకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్‌కు లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం.’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

Also Read: KTR: ‘ఎన్నికల ముందు చెప్పిందొకటి ఇప్పుడు చేసేదొకటి’ – సీఎం రేవంత్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

 

మరిన్ని చూడండి



Source link

Related posts

ITR 2024 Tax Saving Tips Avoid These Mistakes While Last Minute Tax Saving Plans

Oknews

ఇజ్రాయెల్‌ లో బాలీవుడ్ హీరోయిన్ మిస్సింగ్!

Oknews

Telangana Assembly: సీఎం రేవంత్ రెడ్డి Vs కేటీఆర్

Oknews

Leave a Comment