BRS Mlc Kavitha Petition in Supreme Court: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను చేర్చారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది ఆన్ లైన్ లో పిటిషన్ దాఖలు చేశారు. అటు, కవితను ఈడీ రెండో రోజు విచారించనుంది. ఆమెతో పాటు కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
మరిన్ని చూడండి