Latest NewsTelangana

BRS MLC Kavitha Sensational comments On BJP and Liquor Case | నాపై పెట్టింది పొలిటికల్ ల్యాండరింగ్ కేస్‌


MLC Kavitha: లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ టైంలో మీడియాతో మాట్లాడిన ఆమె… కేంద్రంపై, దర్యాప్తు అధికారుల సంచలన ఆరోపణలు చేశారు. 
కోర్టుకు వెళ్తున్న టైంలో జై తెలంగాణ.. జై కేసిఆర్ అంటు నినదించిన కవిత ఏమన్నారంటే…” కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా. తాత్కాలికంగా జైల్లో పెడతారు. మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. తప్పుడు కేసు, ఇది రాజకీయ కుట్ర. మనీ లాండరింగ్ కేసు కాదిది, పొలిటికల్ లాండరింగ్ కేసు లాగా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బీజేపీలో చేరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి బీజేపీ కూటమిలో పోటీ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి బీజేపీ 50 కోట్ల విరాళాలు ఇచ్చారు. ” అంటు విమర్శలు చేశారు. 

మరో 14 రోజుల రిమాండ్‌ను కోరిన ఈడీ 
లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని వివరాలు కవితను అడిగి తెలుసుకోవాల్సి ఉందని… మరో 14 రోజుల రిమాండ్‌కు ఇవ్వానలి రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ కోరింది. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా 14 రోజుల రిమాండ్‌కు ఇచ్చింది న్యాయస్థానం. 

బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌
బెయిల్ ఇవ్వాలని లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టు అయిన కవిత కోర్టుకు విన్నవించుకున్నారు. తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టుకు రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఆమె తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. దీనికి కౌంటర్‌గా ఈడీ అధికారులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజ్వర్‌ చేశారు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

పవన్ ను రిక్వెస్ట్ చేస్తున్న పద్మనాభ రెడ్డి

Oknews

Patancheru MLA Gudem Mahipal Reddy Clarifies Over Meeting With CM Revanth Reddy

Oknews

గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ, బీజేపీ నేత కుమారుడు అరెస్ట్!-hyderabad crime news in telugu ts police burn drugs party in radisson hotel arrested bjp leader son ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment