Latest NewsTelangana

BRS News: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు – పద్మారావు గౌడ్ పేరు ప్రకటించిన కేసీఆర్

PadmaRao Goud As The Secunderabad Brs Mp Candidate: సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిని ఖరారు చేశారు. మాజీ మంత్రి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ (Padmarao Goud) ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో శనివారం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆయన గతంలో డిప్యూటీ స్పీకర్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా, సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ బరిలో నిలవగా.. బీజేపీ తరఫున కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకూ 14 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. ఇంకా భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

పద్మారావు గౌడ్ నేపథ్యం ఇదే

పద్మారావు గౌడ్ 1991 వరకూ కార్పొరేటర్ గా పని చేసి కాంగ్రెస్ నుంచి 2001లో టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పని చేస్తూ 2002లో కారు గుర్తుపై కార్పొరేటర్ గా గెలిచారు. 2004లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సనత్ నగర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఎక్సైజ్ శాఖ, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2018 ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం మేరకు కేసీఆర్ పద్మారావు గౌడ్ ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

14 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

☛ నాగర్ కర్నూల్ – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

☛ మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి

☛ మెదక్ – వెంకట్రామిరెడ్డి

☛ కరీంనగర్ – వినోద్ కుమార్

☛ పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్

☛ జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్

☛ ఖమ్మం – నామా నాగేశ్వరరావు

☛ చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్

☛ మహబూబాబాద్ – మాలోతు కవిత

☛ మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి

☛ ఆదిలాబాద్ – ఆత్రం సక్కు

☛ నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్థన్

☛ వరంగల్ – కడియం కావ్య

Also Read: Telangana Congress Preparations : తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ – 14 సీట్లు టార్గెట్ – రాహుల్ భారీ సభకు ఏర్పాట్లు

Source link

Related posts

TS Mega DSC 2024 Updates : డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా…? మీ సబ్జెక్ట్ సిలబస్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Oknews

Hyderabad BJP Candidate Kompella Madhavi Latha Virinchi Hospitals Chairperson

Oknews

Eagle public rating viral కావాలనే ఈగల్ పై కక్ష గట్టారా

Oknews

Leave a Comment